నవంబర్ 05 (ఆంధ్రపత్రిక): ఇంకా కొన్ని చోట్ల ’కాంతార’ హవానే నడుస్తుంది. కొత్త సినిమాలు రిలీజవుతున్నా కూడా ఈ చిత్రానికి ఆదరణ తగ్గడం లేదు. ’కేజీఎఫ్’ తర్వాత ఆ స్థాయిలో ఇండియా వైడ్‌గా ఈ సినిమా మంచి క్రేజ్ తెచ్చుకుంది. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రం అంతే భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుంది. ఇప్పటికే రూ.200 కోట్ల మార్కును క్రాస్ చేసి కన్నడలో సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. ఈ చిత్రంలో నటుడిగా, దర్శకుడిగా రిషబ్‌శెట్టి పర్ఫార్మెన్స్కు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. ఇక కన్నడలో అత్యధిక మంది వీక్షించిన సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకుల నుండి భారీ డిమాండ్ ఏర్పడటంతో పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇక రిలీజైన ప్రతి భాషలో భారీ వసూళ్ళను సాధిస్తూ డబుల్ బ్లాక్‌బస్టర్ నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా కాంతార ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్ర హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాను నవంబర్ 18నుండి స్టీమ్రింగ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో కూడా నవంబర్ 4నుండి కాంతార ఓటీటీలోకి రానున్నట్లు సోషల్ విూడియాలో వైరల్ అయింది. అయితే వాటిపై చిత్రబృందం రూమార్స్ అంటూ క్లారిటీ ఇచ్చింది. హోంబలే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రిషబ్‌కు జోడీగా సప్తమి గౌడ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ రిలీజ్ చేశాడు. రూ.2 కోట్లతో హక్కులను కొనుకున్న అల్లు అరవింద్ ఇప్పటికే పది రెట్ల లాభాలను పొందాడు. ఇక ఇటీవలే ఈ చిత్రం హిందీలో రూ.50 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!