Kangana Ranaut: మాఫియా చేసిన పెళ్లి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నాడు.. ఎవరి కోసం ఈ పోస్ట్!
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘పేమ కోసం కాకుండా డబ్బు కోసం పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఇలానే ఉంటుంది’ అంటూ ఆమె చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తన కొత్త సినిమాపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆమె స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు
‘‘వేర్వేరు ప్లాట్స్‌లో ఉండే ఓ నకిలీ జోడీ ఇటువంటి ప్రచారం చేయిస్తోంది. భార్య, బిడ్డను వదిలేసి భర్త విహారయాత్రకు వెళ్తే దాని గురించి ఎవరూ రాయరు. సదరు భర్త నాకు విజ్ఞప్తి చేస్తున్నాడు. చర్చించేందుకు నన్ను కలవమంటున్నాడు. సినిమాలు డబ్బు కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది. ఈ నటుడు ‘మాఫియా డాడీ’ ఒత్తిడిలో పెళ్లి చేసుకున్నాడు. ఫేక్ మ్యారేజ్ నుంచి బయటపడేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు. కానీ, అతడికి సహకరించేవారు ఎవరూ లేరు. భార్య, కుమార్తెపైనే అతడు దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇది ఇండియా. ఒక్కసారి పెళ్లి అయితే.. అంతే!’’ అని కంగనా వ్యాఖ్యానించింది. కంగనా నటించిన చిత్రాలు విడుదలకు వరుస కట్టాయి. ‘చంద్రముఖి 2’ సెప్టెంబరులో, ‘తేజస్’ అక్టోబరు 20న, ‘ఎమర్జెన్సీ’ నవంబరు 24న విడుదల కానున్నాయి.