ప్రయాణికులకు తప్పిన ముప్పు
కామారెడ్డి,ఆగస్ట్13(ఆర్‌ఎన్‌ఎ): కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఎదుట అదుపుతప్పి బోల్తా పడిరది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అక్కడే ఉన్న హమాలీల సహాయంతో బస్సు అద్దాలను పగులకొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. ఎవరికీ ప్రాణహాని జరుగక పోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గాయపడినవారిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బస్సు డ్రైవర్‌కు కళ్లు తిరగడంతో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందిన పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!