నవంబర్ 07 (ఆంధ్రపత్రిక): 35 ఏళ్ల తర్వాత మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయనున్న కమల్`మణిరత్నం నాయకన్ మూవీ తర్వాత 35ఏళ్ల సుధీర్ఘ విరామం తర్వాత స్టార్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో మూవీ రాబోతుంది. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ క్రేజీ కాంబినేషన్‌లో కమల్ హాసన్ 234 చిత్రం 2024లో థియేటర్లోకి రానున్నట్లు సగర్వంగా ప్రకటించారు. అయితే ఉలగనాయగన్ కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనుండడం చెప్పుకోదగిన విషయం. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న కమల్.. తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు.అయితే కమల్ హాసన్ చేయబోయే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం వహించనున్నారు. ఇద్దరు సినీ దిగ్గజాలు కమల్ హాసన్, మణిరత్నంల మ్యాజికల్ కలయికలో వచ్చిన నాయగన్ అప్పట్లో కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. దాదాపు 35 సంవత్సరాల తర్వాత మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతుండడంపై సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!