రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ హిట్ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సంచలనాలు నమోదు చేసింది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అభినయానికి బాలీవుడ్ జేజేలు పలికింది.
భైరవగా ప్రభాస్ మెప్పించాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే కర్ణుడు పాత్రలో ప్రభాస్ అభినయానికి ప్రేక్షకులు ఊగిపోయారు. కానీ కర్ణుడిగా ప్రభాస్ కొద్దిసేపు మాత్రమే కనిపించాడు అని అసంతృప్తి ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంది. కర్ణుడి పరాక్రమం కల్కి – 2 లో చూడండి అని దర్శకుడు చెప్పి మొదటి పార్ట్ ముగించాడు.
Kalki2898AD రెండవ భాగం ఎప్పుడు వస్తుందా అని ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా కల్కి -2 కు సంబంధించి కీలక అప్ డేట్ యూనిట్ వర్గాల ద్వారా అందుతోంది. కల్కి -2 ను “Karna3102BC” అనే పేరుతో తీసుకురానున్నారు మేకర్స్. అమితాబ్ బచ్చన్, ప్రభాస్ పాత్రలైన అశ్వత్థామ కర్ణుడి చుట్టూ కథ తిరుగుగుతుందని తెలుస్తోంది. ఇక్కడ గమనించదగ్గ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పార్ట్ – 2 కథా నేపథ్యం AD నుండి BC కి మారుతుంది, అంటే కథనం భవిష్యత్తు నుండి గతానికి వెళుతుంది. కల్కి -2 కథ కాలాన్ని వెనక్కి తీసుకువెళుతుంది. ఫ్లాష్బ్యాక్లతో పాటు, కమల్‌హాసన్ పాత్ర మహాభారత యుద్ధం తర్వాత నిజంగా ఏమి జరిగిందో మరింత వివరంగా తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు నాగి. కర్ణుడు, అర్జునుడు మధ్య యుద్ధ సన్నివేశాల్ని భారీ స్థాయిలో ఉండబోతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించి, 2028 నాటికి సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.