హైదరాబాద్ కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ రేపటి(శుక్రవారం) నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. రేపు కమిషన్ ముందుకు ఎడుగురు సీఈ స్థాయి ఇంజనీర్లు రానున్నారు.
కమిషన్ బహిరంగ విచారణకు రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు రానున్నారు. గత నెలలో కమిషన్.. 15 మందికిపైగా విచారణ చేసింది. రేపటి నుంచి 25 మందికి పైగా కమిషనర్ జస్టిస్ పీనాకి చంద్ర ఘోష్ విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఎస్ఏ, పూణే రిపోర్ట్ కోసం లేఖలు రాసిన కమిషన్, కమిషన్‌కు కావాల్సిన సమాచారం ఇస్తానని ఆయా టీమ్స్ చెప్పాయి. కమిషన్ అడిగిన లాయర్‌ను ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతీ ఒక్కరినీ కమిషన్ బహిరంగ విచారణ చేయనుంది.
ఇక.. ఇప్పటికే కమిషన్ విచారణ కార్యాలయానికి కమిషనర్ జస్టిస్ పీనాకి చంద్ర ఘోష్ చేరుకున్నారు. ఘోష్‌తో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ భేటీ అయ్యారు.రేపటి నుంచి ఎవరిని విచారణ చేయాలి అనే అంశం, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టులపై చర్చించారు. ఇప్పటికే మొదలైన ఓపెన్ కోర్టు విచారణ. గత 20 నుంచి ఐదు రోజుల పాటు ఇరిగేషన్ అండ్ సీఈఓ అధికారులను జస్టిస్ గోష్ విచారించారు.