సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్న కోదండరెడ్డి
హైదరాబాద్,ఆగస్ట్13(ఆర్ఎన్ఎ): కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరిపించాలని తెలంగాణ జన సమితి టీజేఎస్ అధ్యక్షుడు కోదండ రామ్ డిమాండ్ చేశారు. అసంబద్ధ విధానాల కారణంగానే కాళేశ్రం ముంపుకు గురయ్యిందన్నారు. దీనికి టిఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. జల విషాదాల అసమర్థ పాలకులపై రణ దీక్ష’ పేరుతో టీజేస్ పార్టీ కార్యాలయంలో ఆయన దీక్షకు దిగారు. భారీ నష్టాలకు కారణమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని..వరద బాధితులకు న్యాయ సమ్మతమైన నష్టపరిహారం చెల్లించాలనే డిమాండుతో పార్టీ నాయకులతో కలసి దీక్ష చేపట్టారు. గత జులై నెలలో వచ్చిన వరదల కారణంగా పంట నష్టం భారీగా జరిగిందని, వరద బీభత్సంతో ప్రజలు సర్వం కోల్పాయారని ఈ సందర్భంగా కోదండరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం న్యాయ సమ్మతమైన పరిహారం ఇవ్వాలని కోరారు. వరదలతో భద్రాచలం నీట మునిగితే తూతూ మంత్రంగానే సహాయక చర్యలు చేపట్టారని ఆరోపించారు. భారీ ఖర్చుతో నిర్మించిన కాళేశ్వరం పంపులు ఎందుకు మునిగాయని కోదండరామ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపం వల్ల ఎక్కువ నష్టం జరిగిందన్నారు. మేడిగడ్డ, మంచిర్యాలకు కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించిన కోదండ రామ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపించాల్సిందేనని పునరుద్ఘాటించారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!