సాధారణంగా చాలామంది యజమానులు వారి స్టాఫ్ ను స్టాఫ్ గానే చూస్తారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే స్టాఫ్ ను సొంత వాళ్ళ లాగా చూసుకుంటారు. అందులో ఒకరిగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు.
సినిమాలో నటించడం అంటే అంత సులభమైన విషయం ఏమి కాదు. అందులో సినిమా లీడ్ రోల్ చేయాలంటే ఆషామాసి విషయం కాదు. ముఖ్యంగా కథానాయకుడు విషయంలో డైరెక్టర్లు ఎన్నో రకాల విషయాలను పరిగణలోకి తీసుకుంటారు.
ఇందులో ముఖ్యంగా కథానాయకుడు యొక్క బాడీ పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకుని దర్శకులు వారిని ఎంపిక చేసుకుంటున్నారు. బాడీ ఫిట్నెస్, అలాగే అతని యాక్టింగ్ స్కిల్స్ ఇలా ప్రతి విషయంలో అన్ని చూసుకొని దర్శకుడు కథానాయకుడును ఎంచుకుంటారు. మరికొందరైతే కథానాయకుడిని ముందుగా అనుకొని వారిపై కథను తయారు చేస్తారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ లో నిర్మితమవుతున్న ‘వార్ 2’ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘దేవర’ చిత్రంలో కూడా ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ రెండు సినిమాలు యాక్షన్ సినిమాలే. ఇలాంటి యాక్షన్ సినిమాల్లో నటించేందుకు యంగ్ టైగర్ తన శరీరాన్ని ఏ విధంగా ఫిట్ గా ఉంచుకోవాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ విషయంలో తన ఫిట్నెస్ కోచ్ మన్నావ్ ఎప్పుడు తోడుంటాడు. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల్లో నడిచేందుకు భాగంగా ముంబైలో ఉన్నాడు. తన ఫిట్నెస్ కోచ్ జన్మదిన వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొని అతడికి కేక్ తినిపించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందుకే కాబోలు మన జూనియర్ ఎన్టీఆర్ కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటూ పొగడ్తలతో ముంచేత్తుతున్నారు.