ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా జోస్ బట్లర్ ఎంపికయ్యాడు. జూన్ 28న ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి ఇయాన్ మోర్గాన్ తప్పుకోవడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇవాళ (జూన్ 30) బట్లర్‌ను కొత్త సారధిగా ప్రకటించింది. గత పదేళ్లుగా ఇంగ్లండ్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా కొనసాగుతున్న బట్లర్ ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు.
ఇంగ్లండ్ నూతన కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బట్లర్.. ఈసీబీకి, మాజీ సారధి మోర్గాన్‌ను ధన్యవాదాలు తెలిపాడు. గత ఏడేళ్లుగా ఇంగ్లండ్ జట్టును అద్భుతంగా ముందుండి నడిపించిన మోర్గాన్‌ను ప్రత్యేకంగా కొనియాడాడు. మోర్గాన్ నుంచి బాధ్యతలు చేపట్టడం గొప్ప గౌరవమని అన్నాడు. ఇంగ్లండ్ తరఫున 57 టెస్ట్‌లు, 151 వన్డేలు, 88 టీ20 ఆడిన బట్లర్ తొమ్మిది వేలకు పైగా పరుగులు సాధించాడు. బట్లర్ తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 13 సెంచరీలు, 54 హాఫ్ సెంచరీలు సాధించాడు.