సెప్టెంబర్ 26 (ఆంధ్రపత్రిక): గతేడాది ’మోసగాళ్ళు’ సినిమాతో భారీ ప్లాప్‌ను సాధించిన మంచు విష్ణు ఈ సారి ఎలాగైనా ’జిన్నా’తో మంచి కంబ్యాక్ ఇవ్వాలని ఉన్నాడు. ఇషాన్ సూర్య దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రం పోస్ట్ పోన్ కానున్నట్లు తెలుస్తుంది. దసరా బరిలో ఇప్పటికే ’గాడ్‌ఫాదర్’, ’ది ఘోస్ట్’ చిత్రాలు విడుదల కానున్నట్లు అపిషియల్గా ప్రకటన వచ్చింది. ఇక ఈ రెండు చిత్రాలకు ప్రస్తుతం విపరీతమైన బజ్ ఉంది. ఈ క్రమంలో జిన్నా చిత్రాన్ని రిలీజ్ చేయడం కరెక్టు కాదని మేకర్స్ భావించారట. దాంతో జిన్నా చిత్రాన్ని రెండు వారాలు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా అక్టోబర్ 21న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనున్నారట. ఈ చిత్రంలో విష్ణుకు జోడీగా సన్నిలియోన్, పాయల్ రాజ్‌పుత్‌లు నటించారు. ప్రముఖ రచయిత, నిర్మాత కోనవెంకట్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు క్రీయేటీవ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరి స్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అవ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!