కె.కోటపాడు,ఫిబ్రవరి08(ఆంధ్రపత్రిక):
ఆంధ్రప్రదేశ్ వైద్య విధానపరిషత్ స్థానిక సి.హెచ్.సి( సామాజిక ఆరోగ్య కేంద్రం)ను జడ్పీటీసీ సభ్యురాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ ఈర్లె అనురాధ సందర్శించారు. పలువురు రోగులను పలకరించి పరామర్శించారు.హాస్పిటల్ లో అందుతున్న వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందించాలని రాష్ట్రఉపముఖ్య మంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రత్యేక చొరవ, కృషి తో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి 50పడకల హాస్పిటల్ గా అప్ గ్రేడ్ అయ్యిందని చెప్పారు. భవన నిర్మాణం పనులు త్వరలోనే పూర్తయిన తర్వాత వైద్య సేవలను విస్తరిస్తారని జడ్పీటీసీ సభ్యురాలు అనూరాధ అన్నారు.