జనసేన పార్టీకి తక్కువ పదవులు ఇచ్చి అవమానించారు?అంటూ పోతిన మహేష్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఎక్కడ ఉందని వైసీపీ నేత పోతిన మహేష్ ప్రశ్నించారు.
మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారని విమర్శించారు.
pothina mahesh slams pawan kalyanపవన్ కళ్యాణ్ కి మాత్రమే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలను అగౌరవపరిచారని అన్నారు. ”వైయస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపులకు ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఆ సామాజిక వర్గాల గౌరవాన్ని పెంచారు” అని పేర్కొన్నారు.
ఇది ఇలా ఉంటే..తనకు కంగ్రాట్స్ చెబుతూ సీఎం చంద్రబాబు చేసిన ట్వీట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘సీఎం గారూ.. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నా. ఎన్డీయే నాయకత్వ సూచనలతో మంత్రుల సమష్టి కృషితో సమాజంలోని అన్ని వర్గాల పురోగతికి పాటుపడతాం అని పేర్కొన్నారు. సుసంపన్న ఏపీ కోసం మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నా’ అని ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.