— వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా
కోరుకొండ, ఫిబ్రవరి 9 (ఆంధ్ర పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా నిరంతరం రకరకాల సంక్షేమ పథకాలతో ప్రజలందరికీ లబ్ధి చేకూర్చిన నేపథ్యంలో ఇంటింటా ‘మా నమ్మకం నువ్వే జగనన్నా’ అనే నినాదం ప్రతిధ్వనించేలా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. మండల కేంద్రం కోరుకొండ సుబ్రహ్మణ్య మైదానంలో గురువారం సాయంత్రం నిర్వహించిన గృహ సారథులు, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్ల సమావేశంలో రాజా మాట్లాడారు. ప్రజలకు మరింతగా చేరువ కావడానికి ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నఈ కార్యక్రమంలో గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు మమేకమై ఈ సంక్షేమ స్రవంతి నిరంతరాయంగా కొనసాగాలంటే మరోసారి జగనన్న ముఖ్యమంత్రి కావాలనే విషయాన్ని ప్రజలకు సమర్థవంతంగా వివరించడానికి కంకణబద్ధులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ జడ్పిటిసి కరీనాగేశ్వరరావు మండల కన్వీనర్ అడప కనకరాజు కోకన్వీనర్ గణేశుల పోశయ్య, వుల్లి బుజ్జి బాబు,కళ్యాణ రాంబాబు ఆడపా కుమార్,రాంప్రసాద్,నేతిల చిన్ని,బొండాడ చందు, నీరుకొండ బాబ్జి,వాకానరసింహారావు,వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు,తదితరులు పాల్గొన్నారు.