రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో రాష్ట్రం
పాదయాత్రలో నారా లోకేశ్ విమర్శలు
తిరుపతి,ఫిబ్రవరి16(ఆంధ్రపత్రిక): రైతులకు సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా ప్రభుత్వం దగా చేస్తోందని టిడిపి నేత నారా లోకేష్ విమర్శించారు. ’నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ సీఎం జగన్ రాష్టాన్న్రి రైతు లేని రాజ్యనీగా తయారు చేశారని మండిపడ్డారు. రుణమాఫీ, సబ్సిడీ రుణాలు, గిట్టుబాటు ధర, భూసార పరీక్షలు లేకుండా జగన్ ప్రభుత్వం రైతులను దగా చేసిందని లోకేష్ ఆరోపించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర 21వ రోజు గురువారం కొనసాగుతోంది. తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభమైంది. కేవీబీపురం మండలం, రాజులకండ్రిగలో రైతులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం.. అనుబంధ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. రాయలసీమలో వ్యవసాయ రంగాన్ని నీరుగార్చారని, సీమపై ప్రేమ లేని జగన్ రెడ్డి రాయలసీమలో ఎలా పుట్టారని అన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత టీడీపీ ప్రభుత్వందేనని లోకేష్ వ్యాఖ్యానించారు. కోర్టుదొంగ వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారని, ఎవరైనా దొంగతనం చేసి కోర్టుకు వెళ్తారు.. కానీ ఈ మంత్రి కోర్టులోనే దొంగతనం చేశారని నారా లోకేష్ అన్నారు. దొంగ వ్యవసాయ శాఖ మంత్రి అయితే రైతుల పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. ఇప్పుడు మంత్రి కాకాణీకి సిబిఐ ’రా’ అని పిలుస్తోందన్నారు. రాష్ట్రంలో పరిపాలన దరిద్రంగా ఉందని.. అధికార పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారన్నారు. సైకో పరిపాలను తరిమికొట్టాలంటే కలిసికట్టుగా పోరాడుదామని పిలుపిచ్చారు. సైకోరాజ్యంలో దుబారా ఖర్చులు పెరిగి రైతులపై భారం పడిరదని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే లోకేష్ పాదయాత్రకు వెళ్తున్న మార్గంలో టీడీపీ శ్రేణులు కట్టిన జెండాలు ,బ్యానర్లను పోలీసులు స్వయంగా తొలగించి.. పోలీసు వాహనాల్లో తరలిస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గం, తిమ్మ సముద్రం, రాగి కుంట, కొత్తూరు, పివి కండ్రిగ గ్రామాల్లో ఏర్పాటు చేసిన జెండాలు, బ్యానర్లు తొలగించి పోలీసు వాహనాల్లో తరలించారు. దీంతో రైతులు పోలీసులను నిలదీశారు. శ్రీకాళహస్తి మొదలు ఎక్కడబడితే అక్కడ బియ్యపు మధు ఫీక్సీలు కట్టి ఉన్నా ఎందుకు తీయలేదు అని రైతులు ప్రశ్నించారు. మొదట వాటిని తీసి ఆ తర్వాత రావాలని.. అప్పుడు తామే స్వచ్చందంగా జెండాలను తిస్తామని పోలీసులకు రైతులు చెప్పారు. రైతుల చైతన్యంతో వెనక్కు తగ్గిన పోలీసులు.. జెండాలు తిరిగి వెనక్కి ఇచ్చారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!