మచిలీపట్నం అక్టోబర్ 12 ఆంధ్ర పత్రిక.
జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 204 జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల్లో
1,03,023 మంది ప్రజలు పాల్గొని వైద్య సేవలు పొందారని జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి గత సెప్టెంబర్ నెల 30వ తేదీ నుండి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శిబిరాలను సజావుగా నిర్వహిస్తున్నామన్నారు.
ప్రజలందరి ఆరోగ్యం పరిరక్షించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని సంకల్పించిందన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల ఇంటి గడప వద్దకే కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు.
ప్రతి ఇంటికి వాలంటీర్లు, ఏఎన్ఎంలు వచ్చి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి సమీపంలో షెడ్యూల్ ప్రకారం నిర్వహించే వైద్య ఆరోగ్య శిబిరాలకు వచ్చి వైద్యులకు చూపించుకుని మందులు ఉచితంగా పొందవచ్చనే విషయం తెలియజేయడం జరుగుతుందన్నారు.
ఒకవేళ ఏదేని అనివార్య కారణాల వలన ఇంటి వద్ద వైద్య పరీక్షలు చేయించుకోని వారు నేరుగా వైద్య శిబిరానికి వచ్చి కూడా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చాన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 4,21,882 ఇళ్లకు ఏఎన్ఎంలు వెళ్లి ఆరోగ్యపరమైన స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేశారాన్నారు.
జిల్లాలో గత సెప్టెంబర్ నెల 30వ తేదీ నుండి ఈనెల 11 వ తేదీ వరకు నిర్వహించిన 204 వైద్య శిబిరాలకు 1,03,023 మంది ప్రజలు హాజరుకాగా అందులో 46,317
మంది పురుషులు, 56,706 మంది మహిళలు ఉన్నారన్నారు. అలాగే 6,093 మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారన్నారు. . వీరందరికీ వైద్యులు పరీక్షించి అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తున్నారు.
అంతేకాకుండా వీరిలో 2,064 మంది గర్భిణీ స్త్రీలు, బాలింతలు వైద్య పరీక్షలకు హాజరయ్యారు.
అలాగే 21,976 మంది కంటి పరీక్షలకు హాజరు కాగా వారిలో అవసరమైన 5, 860 మందికి కంటి అద్దాలు కూడా ఉచితంగా పంపిణీ చేసామన్నారు.
వైద్య శిబిరంలో 484 మంది సాధారణ వైద్యులు, 241 మంది ప్రత్యేక వైద్యులు వైద్య సేవలు అందించారన్నారు.
ఈ సందర్భంగాజిల్లాలోని ప్రజలందరూ జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ కోరారు.