మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు
ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ
అమరావతి,మార్చి 24 ఆంధ్రపత్రిక : టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన పేదల పథకాలను రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం డిస్టిలరీలను ఎందుకు రద్దు చేయడం లేదని టీడీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన పంచుమర్తి అనూరాధ ప్రశ్నించారు. సంపూర్ణ మధ్య నిషేధం హావిూ ఏమయ్యిందన్నారు. టిడిపి ప్రజలకు మేలు చేసే పథకాలను తుంగలో తొక్కి..సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి..మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. టిడిపి ప్రభంజనం మొదలయ్యిందని..ఇక రానున్న రోజుల్లో వైసిపికి జనం టాటా చెప్పడం ఖాయమని అన్నారు. అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధిస్తామని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హావిూ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో వంతుల వారీగా మద్యం నిషేధిస్తామని మాట మార్చారని ఆరోపించారు. ప్రస్తుతం విచ్చలవిడిగా మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆరోపించారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే తన సొంత జేబులకుకోట్లు రావడానికి మధ్యం పాలసీని మార్చుకున్నారని జగన్‌ను విమర్శించారు. శాసనసభలో జగన్ అవాస్తవాలు మాట్లాడారని తెలిపారు. ప్రజల పక్షాన పోరాడేందుకు యత్నిస్తుంటే తమ సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేసారని పేర్కొన్నారు. ప్రభుత్వ మెడలు వంచి ప్రజలకు మేలు చేయాలనేదే తమ ఉద్దేశమని, ప్రజల ప్రాణాల రక్షణ కోసం టీడీపీ సభ్యులు చేస్తున్న పోరాటాలకు మద్దతు తెలుపాలని పిలుపునిచ్చారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!