Jagadish Reddy: అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి , బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
హాలియాలోలో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహాక సమావేశంలో జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. వంద రోజుల పాలనలో అంతా దోచుకున్నారని ఆరోపించారు. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పాలన కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని జగదీశ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.