అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన జాహ్నవి మృతి చెందడంపై ఓ పోలీసు అధికారి చులకనగా మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. ఆమె మృతిపై హేళనగా మాట్లాడిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. ఓవైపు ఆ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ దీనిపై ఆ పోలీస్ అధికారి స్పందించారు. తాను జాహ్నవి మృతిపై చేసిన వ్యాఖ్యలు ఉద్దేశించినవి కావని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ వివాదానికి కారణమైనటువంటి ఆ పోలీసు అధికారికి సియాటెల్ పోలీసు విభాగం మద్దతుగా నిలిచింది.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన జాహ్నవి మృతి చెందడంపై ఓ పోలీసు అధికారి చులకనగా మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. ఆమె మృతిపై హేళనగా మాట్లాడిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. ఓవైపు ఆ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ దీనిపై ఆ పోలీస్ అధికారి స్పందించారు. తాను జాహ్నవి మృతిపై చేసిన వ్యాఖ్యలు ఉద్దేశించినవి కావని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ వివాదానికి కారణమైనటువంటి ఆ పోలీసు అధికారికి సియాటెల్ పోలీసు విభాగం మద్దతుగా నిలిచింది. ఇక వివరాల్లోకి వెళ్తే..ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (23) ఈ ఏడాది జనవరిలో సియాటెల్ పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి… డేనియల్ అడెరెర్ అనే పోలీసు అధికారి.. చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన ఓ వీడియో ఇటవల సోషల్ మీడియాలో వైరలైంది.
ఆమె ఓ సాధారణ వ్యక్తని.. ఆమె మరణానికి విలువ లేదు, 11 లక్షల డాలర్ల చెక్ ఇస్తే సరిపోతుంది అంటూ ఆ పోలీసు అధికారి నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. భారత్ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఆ పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారి డేనియల్‌పై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. అయితే తాజాగా ఈ వివాదంపై సియాటెల్ పోలీసు అధికారుల గిల్డ్ ఓ ప్రకటనను విడుదల చేసింది. వైరల్ అయినటువంటి దృశ్యాలు బాడీక్యామ్ వీడియో రికార్డు చేసినవని.. అయితే ఈ సంభాషణల్లో ఒకవైపు మాత్రమే బయటికి వచ్చిందని పేర్కొంది. అయితే అందులో ఇంకా చాలా వివరాలు ఉన్నాయని అవి ప్రజలకు తెలియవు అంటూ చెప్పింది. పూర్తి వివరాలుతెలియకపోగా.. అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పడంలో మీడియా విఫలమైనట్లు డేనియల్‌కు గిల్డ్ సపోర్ట్‌గా నిలిచింది. అలాగే ఈ ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులకు డేనియల్ రాసినటువంటి లేఖను కూడా గిల్డ్ విడుదల చేసింది
న్యాయవాదులను ఉద్దేశిస్తూ తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు డేనియల్ తన లేఖలో తెలిపాడు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు న్యాయస్థానంలో వాదనలు ఎంత హస్యాస్పదంగా ఉంటాయో గుర్తుకొచ్చి తాను నవ్వినట్లు పేర్కొన్నారు. జనవరి 23వ తేదీన పెట్రోలింగ్ వాహనం వల్ల ప్రమాదం జరిగిందని తెలిసి సాయం చేసేందుకు వెళ్లినానని చెప్పారు. తిరిగి ఇంటికి వస్తుండగా.. తోటి అధికారికి ఫోన్ చేసి ఘటన గురించి చెప్పినట్లు తెలిపారు. అప్పటికీ నా విధులు పూర్తైనట్లు చెప్పారు. అయితే బాడీక్యామ్ కెమెరా ఆన్‌లో ఉన్న విషయం తనకు తెలియదని.. దీంతో తాను చేసిన వ్యక్తిగత సంభాషణ రికార్డ్ అయినట్లు పేర్కొన్నారు. నేను కేవలం న్యాయవాదులు జరిపే వాదనల గురించే మాట్లాడానని.. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనిషి ప్రాణం విలువ గురించి ఇరుపక్ష లాయర్లు ఎలా వాదనలు చేస్తారో, బేరసారాలు ఎలాకొనసాగిస్తారో చాలా సార్లు చూశానని అన్నాయి. అవి ఎంత హస్యాస్పందగా ఉంటాయో గుర్తుకొచ్చి నవ్వుకున్నానని.. డేనియల్ తాను రాసిన లేఖలో వివరించారు. ఉద్దేశపూర్వకంగా బాధితురాలిని అవమానించేలా వ్యాఖ్యానించలేదని చెప్పారు. పూర్తి వివరాలు తెలియకపోతే.. ఇలాంటి ఊహాగానాలే వైరల్ అవుతాయని.. దీనిపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని.. దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి శిక్ష వేసినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధమని చెప్పారు. మరోవైపు డేనియల్ను ఉద్యోగం నుంచి తొలగించాలంటూ అమెరికాలో ఆన్లైన్ పిటిషన్లు రావడం మొదలయ్యాయి.