ప్రకృతి మనకు ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ ను అందించింది. పోషకాల పవర్ హౌజ్‌గా పిలుచుకునే డ్రై ఫ్రూట్స్ లో అత్యంత విలువైన డ్రై ఫ్రూట్ మకాడమియా నట్స్ అనేవి ఒక రకమైన డ్రై ఫ్రూట్స్.
ఇది ఆస్ట్రేలియాకు చెందినది. ఈ డ్రైఫ్రూట్ గురించి దాదాపు మనలో చాలా మందికి తెలియదు. ఈ మకాడేమియా డ్రై ఫ్రూట్ కిలో ధర వేలల్లో ఉంటుంది. మకాడమియా నట్స్ రుచితో పాటు విలువైన పోషకాలతో కూడిన ఆహారం. మకాడమియా నట్స్‌లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అధికంగా ఉన్నాయి. మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.
మకాడమియా నట్స్‌లో ఉండే విటమిన్ E, యాంటీఆక్సిడెంట్ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. మకాడమియా నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలం. ఇవి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. మకాడమియా నట్స్‌లో ప్రోటీన్ పుష్కలం. ఇవి కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మకాడమియా నట్స్ తక్కువ కేలరీలు, కొవ్వును కలిగి ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. మకాడమియా నట్స్‌ను రోజుకు 30 గ్రాముల వరకు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచన.
మకాడమియా నట్స్‌లో ఒమేగా-9, ఒమేగా-7 వంటి మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. ఈ కొవ్వులు ఇన్ఫ్లమేషన్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెకడమియా నట్స్ లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. గ్లైసమిక్ ఇండెక్స్ కలిగి ఉండే ఈ నట్స్ ను షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా తినొచ్చు. నీరసం, బలహీనత తగ్గించి, శరీరానికి కావలసిన బలాన్నిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడతాయి.