చంద్రబాబును కాదని యువకులంతా జగన్‌కు అండగా నిలిచి గెలిపిస్తే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తారు.జగన్‌ను గెలిపించిన యువతే ఇప్పుడు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. విజయవాడలో బీజేవైఎం ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సంఘర్షణ యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోయే విధంగా జగన్ పాలన సాగుతోందని విమర్శించారు. .రాష్ట్రంలో మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని.. ఈ మాఫియాలన్నింటి ఆట కట్టిస్తుందని చెప్పారు. దిల్లీలో డ్రగ్ మాఫియాలో కేజ్రీవాల్ పాత్ర ఉందని.. అక్కడి లిక్కర్ మాఫియాతో ఏపీ ప్రభుత్వానికీ లింకు ఉందని ఆరోపించారు. అవి త్వరలోనే బయటకొస్తాయని తెలిపారు. గంజాయి మాఫియాతో ఏపీలో యువత నిర్వీర్యం అయిపోతుందన్న ఆయన.. సీఎం ఇప్పుడైనా మేలుకోని గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలని హితవుపలికారు. యువత జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. అవినీతిలో ఏపీ నాలుగో స్థానంలో ఉంటే.. తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. కేసీఆర్, జగన్‌లు అవినీతిలో ప్రథమ స్థానం కోసం పోటీ పడుతున్నారని ఠాకూర్ దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం ఏపీకి 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఇచ్చిందని గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం రూ.4లక్షల కోట్లు అప్పు చేసినా అభివృద్ధి లేదన్న ఠాకూర్.. ఒక్క రాజధానికే డబ్బు లేనప్పుడు 3 రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు. జగన్‌కు జీఎస్టీ కంటే జేఎస్టీ ట్యాక్స్‌పైనే ఎక్కువ ఆసక్తి అని ఎద్దేవా చేశారు. జగన్ లిక్కర్ కింగ్ మాత్రమే కాదు.. స్టిక్కర్ కింగ్ అని విమర్శించారు. కేంద్ర పథకాలకు జగన్ తన స్టిక్కర్లు వేసుకుంటున్నారని పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సునీల్ దేవ్‌ధర్, సీఎం రమేశ్ సత్యకుమార్, పురంధేశ్వరి, విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!