విజయవాడ/హైదరాబాద్,డిసెంబర్ 6 (ఆంధ్రపత్రిక): తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఐటీ దాడులు నిర్వహించడం కలకలం రేపుతోంది. మంగళవారం తెల్లవారు జాము నుంచే రెండు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో వంశీరామ్ బిల్డర్స్ చైర్మన్ సుబ్బారెడ్డి బావమరిది, డైరెక్టర్ జనార్ధన్‌రెడ్డి ఇంట్లో ఉదయం నుంచే సోదాలు చేస్తున్నారు. వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయం, ఇళ్లల్లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొత్తం రెండు రాష్ట్రాల్లో కలిపి 36 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వెళ్లిన ఐటీ అధికారులు విజయవాడలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తు న్నారు. వంశీరామ్ బిల్డర్స్‌పై తనిఖీల్లో భాగంగానే వైసీపీ నేతల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు చెందిన స్థలం డెవలప్‌మెంట్ కోసం వంశీరామ్ బిల్డర్స్ తీసుకుంది. ఒప్పందంలో భాగంగా జరిగిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. గత నెలలో హైదరాబాద్‌లోని మంత్రి మల్లారెడ్డి ఇళ్లతో పాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహి తుల ఇళ్లల్లో రెండు రోజుల పాటు ఐటీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం సీజ్ చేసింది. విచారణకు రావాల్సిందిగా మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులుకు నోటీసులు జారీ చేసింది. తాజాగా ఆదాయపు పన్నుశాఖ అధికారులు కూడా తెల్లవారుజాము నుంచి సోదా లు నిర్వహించడం ఆసక్తి రేపుతోంది. కొన్ని రోజులుగా ఢల్లీి లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఈడీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో మరోసారి ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్తల ఇళ్లలో తనిఖీలు చేస్తోంది. జూబ్లీహిల్స్ లోని వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డితో పాటు ఆయన బావమరిది కాంట్రాక్టర్ జనార్ధన్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 15 చోట్ల ఐటీ అధికారుల తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.మంత్రి మల్లారెడ్డి ఇళ్లతో పాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో రెండు రోజుల పాటు ఐటీ సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం సీజ్ చేసింది. విచారణకు రావాల్సిందిగా మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులకు నోటీసులు పంపింది. అంతకు ముందు మంత్రి గంగుల కమలాకర్, టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ గాయత్రి రవి ఇళ్లలో కూడా ఐటీ, ఈడీ సోదాలు జరిగాయి. విజయవాడలో వైసిపి నేత దేవినేని అవినాష్ ఇంట్లో ఐటి అధికారులు సోదాలు చేపట్టారు. మంగళవారం ఉదయం 6 గంటల 30 నిముషాల నుండి గుణదలలోని దేవినేని అవినాష్ నివాసంలో ఐటి అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ భూమి వ్యవహారానికి సంబంధించి ఐటీ అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని స్థిరాస్తి వ్యాపారి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. వంశీరామ్ బిల్డర్స్ యజమాని ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేశారు. హైదరాబాద్, విజయవాడతో పాటు నెల్లూరులోనూ ఆ సంస్థకు చెందిన సీఈవో, డైరెక్టర్లు, పెట్టుబడిదారుల కార్యాలయాలు, ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో 20కిపైగా బృందాలు పాల్గొంటున్నాయి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!