
Ishwaralayas are getting ready for Mahashivratri
కె.కోటపాడు,ఫిబ్రవరి12(ఆంధ్రపత్రిక): ఈనెల18వతేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని చంద్రయ్యపేట గ్రామంలో శ్రీ బ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయం ముస్తాబయ్యింది.కె. కోటపాడు-విశాఖపట్నం రోడ్లో చంద్రయ్యపేటశివారున రోడ్డు పక్కనే గల పరమేశ్వరుని ఆలయానికి ఇటీవలే రంగులు వేయించడంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గడచిన ప్రతి ఏటా కార్తీక మాసం, మహాశివరాత్రికి ఆలయానికి విద్యుత్ దీపాలంకరణ చేసేవారు.దాంతో రాత్రి వేళల్లో ఆలయం తళతళలాడుతూ ఆకర్షణీయంగా గోచరించేది.ఈ మహా శివరాత్రి వేళ శివాలయానికి రంగులు వేయించడంతో కొత్తగా కళకళ లాడుతోంది. కాగా మండలంలో అర్లి, కె.కోటపాడు, గొండుపాలెం, ఎ.కోడూరు, మేడిచర్ల, ఆనందపురం తదితర గ్రామాల్లో ఈశ్వరలాయాలు మహాశివరాత్రి పర్వదినానికిముస్తాబవుతున్నాయి.