బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది . టాలీవుడ్ కు చెందిన నటి హేమా ఈ రేవ్ పార్టీలో బెంగుళూరు పోలిసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది.
కానీ తానుగా అక్కడ లేనని హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో ఉన్నట్టు ఓ వీడియో రిలీజ్ చేసి అందరిని నమ్మించే ప్రయత్నం చేసి బోల్తా పడింది. ఈ కేసు దర్యాప్యు చేపట్టిన బెంగుళూరు పోలీసులు తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. మొత్తం 88 మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు పోలీసులు.
1086 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు. టాలీవుడ్ సీనియర్ నటి హేమా ఈ రేవ్ పార్టీ లో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఈ పార్టీలో MDMA డ్రగ్ ను హేమా సేవించినట్టు ఆధారాలను పోలీసులు సేకరించడంతో పాటు, మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జ్ షీట్ కు జోడించారు. హేమా తో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు, పార్టీ నిర్వహించిన 9 మంది పై ఇతర సెక్షన్ ల కింద కేసు నమోదు చేసారు. NDPS సెక్షన్ 27 కింద నటి హేమా ను నిందితురాలిగా పేర్కొన్న పోలీసులు హేమా తో పాటు హాజరైన మరో యాక్టర్ కు డ్రగ్స్ నెగిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. తానూ ఏ పాపం ఎరుగను, కొందరు కావలని ఈ కేసులో తనను ఇరికించారని ప్రగల్బాలు పలికిన నటి హేమా, ఛార్జ్ షీట్ లో పేరు నమోదు చేయడంతో గతంలో ఆమె రిలీజ్ చేసిన వీడీయో పోలీసుల నుండి తప్పిచుకునేందుకు ఆడిన నాటకంలో భాగంగా చేసిందేనని తేలిపోయింది. ఈ కేసులో దూకుడుమీదున్న పోలీసులు హేమ అరెస్ట్ కు అన్ని ఆధారాలు సేకరించారని, త్వరలోనే అరెస్ట్ తప్పదని సమాచారం.