సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు, చర్మ సమస్యలకు మన జీవనశైలిలో కలిగే మార్పులు అని చెప్పుకోవచ్చు. బలహీనంగా ఉండడం, శరీరంలో రక్తం తగ్గిపోవడం, రక్తహీనత , హిమోగ్లోబిన్ తగ్గిపోవడం వలన జుట్టు రాలడం.. నీరసం, అలసట, నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు ఐరన్ ..
సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు, చర్మ సమస్యలకు మన జీవనశైలిలో కలిగే మార్పులు అని చెప్పుకోవచ్చు. బలహీనంగా ఉండడం, శరీరంలో రక్తం తగ్గిపోవడం, రక్తహీనత , హిమోగ్లోబిన్ తగ్గిపోవడం వలన జుట్టు రాలడం.. నీరసం, అలసట, నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు ఐరన్ లోపం వల్ల వస్తాయి. ముఖ్యంగా ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఎక్కువగా స్త్రీలు ఐరన్ లోపంతో ఇబ్బంది పడుతుంటారు. ఐరన్ ఎక్కువగా తీసుకోవడం వలన రక్తంలో హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. అలాగే ఐరన్ (Iron) లోపం వలన జుట్టు, చర్మంపై అనేక ప్రభావాలు చూపిస్తుంది. అయితే ఐరన్ లోపాన్ని కొన్ని లక్షణాలను గుర్తించవచ్చు. అవేంటో తెలుసుకోండి.
శరీరంలో ఐరన్ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఐరన్ లోపం ఉన్నప్పుడు ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో ఆక్సిజన్ చర్మ కణాలకు చేరదు. దీంతో కళ్ల చుట్టూ చర్మం, నల్లగా మారడం వంటి సమస్యలు, కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి.
ఐరన్ లోపం వలన చర్మంపై తామర వంటి సమస్యలు కలుగుతాయి. శరీరంలో ఐరన్ లేకపోవడం వలన చర్మం కాంతి తగ్గి.. పాలిపోయినట్లుగా ఉంటుంది. ఐరన్ లేకపోవడం వలన చర్మం పొడిగా మారుతుంది.. దద్దర్ల సమస్యలు కలుగుతాయి.
ఐరన్ లోపం వలన రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గుతుంది. హిమోగ్లోబిన్ శరీరంలోని కణాలకు ఆక్సిజన్ అందిస్తుంది. ఐరన్ వలన జుట్టు పెరుగుదల జరుగుతుంది. ఐరన్ లోపం వలన జుట్టు నిర్జీవంగా మారడం, ఎక్కువగా రాలిపోవడం జరుగుతుంది.
ఐరన్ లోపాన్ని ఎలా అధిగమించాలి ? బలహీనంగా అనిపించడం, అలసట, నీరసం, జుట్టు రాలడం, చర్మ సమస్యలు, నిద్రమలేమి, ఒత్తిడి, కంగారు, కాళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. డాక్టర్ సలహాలతో ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. అలాగే ఆహారంలో వీలైనంత వరకు ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు, కాయ ధాన్యాలు, బీన్స్, పాలకూర, తృణధాన్యాలు వంటి పదార్థాలను తీసుకోవాలి.