ఐఆర్సీటీసీ టూరిజమ్ అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. అనువైన బడ్జెట్లోనే ప్యాకేజీని అందిస్తోంది. కేవలం ఎల్లోరా గుహలు మాత్రమే కాక, ఔరంగాబాద్, నాసిక్, షిర్డీలను కూడా ఈ ప్యాకేజీలో సందర్శించొచ్చు. ఈ ప్యాకేజీ పేరు మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర ఎక్స్ హైదరాబాద్. ఇది మూడు రాత్రులు, నాలుగు పగళ్లు ఉంటుంది. విమానంలో హైదరాబాద్ నుంచి వెళ్లి రావొచ్చు. రూ. 20, 950 నుంచి ప్యాకేజీ రేట్లు మొదలవుతాయి.
చూపు తిప్పుకోనివ్వని అందాలు అజంతా, ఎల్లోరా గుహాల సొంతం. హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పకళారీతులు ఒకే చోట కనువిందు చేసే ప్రాంతం అది. ఈ అందాలను ఆస్వాదించాలే గానీ వర్ణించలేం. జీవితంలో ఒక్కసారైనా ఆ శిల్పసౌందర్యాన్ని పరికించాలని చాలామంది భావిస్తున్నారు. మీరు కూడా అలాంటి ఆలోచనలతోనే ఉంటే మీకో గుడ్ న్యూస్. ఐఆర్సీటీసీ టూరిజమ్ అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. అనువైన బడ్జెట్లోనే ప్యాకేజీని అందిస్తోంది. కేవలం ఎల్లోరా గుహలు మాత్రమే కాక, ఔరంగాబాద్, నాసిక్, షిర్డీలను కూడా ఈ ప్యాకేజీలో సందర్శించొచ్చు. ఈ ప్యాకేజీ పేరు మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర ఎక్స్ హైదరాబాద్. ఇది మూడు రాత్రులు, నాలుగు పగళ్లు ఉంటుంది. విమానంలో హైదరాబాద్ నుంచి వెళ్లి రావొచ్చు. రూ. 20, 950 నుంచి ప్యాకేజీ రేట్లు మొదలవుతాయి. ఐఆర్సీటీసీమార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర ఎక్స్ హైదరాబాద్ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్యాకేజీ వివరాలు ఇవి..
పేరు: మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర ఎక్స్ హైదరాబాద్(ఎస్హెచ్ఏ45)
వ్యవధి: మూడు రాత్రులు, నాలుగు పగళ్లు
ప్రయాణ సాధనం: హైదరాబాద్ నుంచి విమానంలో..
ప్రయాణ తేదీ: 2023, అక్టోబర్ 15
కవరయ్యే ప్రాంతాలు: ఔరంగాబాద్, ఎల్లోరా, నాసిక్, షిర్డీ మెజెస్టిక్ మహారాష్ట్ర
పర్యటన సాగుతుందిలా..
డే1(హైదరాబాద్ నుండి షిర్డీ): మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి షిర్డీ చేరుకుంటారు. అక్కడ ఐఆర్సీటీసీ సిబ్బంది మిమ్మల్ని రిసీవ్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. సాయంత్రం సాయిబాబా ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి భోజనం చేసి షిర్డీలోనే బస చేస్తారు.
డే2(షిర్డీ – నాసిక్ – షిర్డీ): ఉదయం హోటల్లో అల్పాహారం చేసి నాసిక్ బయలుదేరుతారు. త్రయంబకేశ్వర ఆలయాన్ని, మధ్యాహ్నం పంచవటిని సందర్శించి సాయంత్రానికి తిరిగి షిర్డీ చేరకుంటారు. రాత్రిభోజనంచేసి షిర్డీలోనే బస చేస్తారు.
డే3(షిర్డీ – శనిషింగ్నాపూర్ – ఎల్లోరా – ఔరంగాబాద్): ఉదయం హోటల్లో అల్పాహారం చేశాక షిర్డీకి 70కిలోమీటర్ల దూరంలో ఉన్న శనిషింగ్నాపూర్కు బయలుదేరుతారు. అక్కడ శనిదేవుని ఆలయాన్ని సందర్శిస్తారు. తరువాత 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరాకు బయలుదేరుతారు. అక్కడ ఎల్లోరా గుహలు, ఘృష్ణేశ్వర్ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం అక్కడి నుంఇచ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్‌కు వెళ్తారు. రాత్రి బస అక్కడే ఉంటుంది.
డే4(ఔరంగాబాద్ – హైదరాబాద్): ఉదయం హోటల్లో అల్పాహారం చేశాక బీబీ-కా-మక్బరాను సందర్శిస్తారు. మధ్యాహ్న భోజనం చేశాక ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు.
ప్యాకేజీ ధరలు ఇలా..
హోటల్లో ఒక్కరికే సింగిల్ రూం కావాలనుకుంటే మొత్తం ప్రయాణ చార్జీలతో కలిపి రూ. రూ 25,550 చార్జ్ చేస్తారు. హోటల్లో డబుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికీ రూ. రూ 21,200, ట్రిపుల్ షేరింగ్ అయితే రూ, 20950 తీసుకుంటారు. అలాగే ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు ప్రత్యేకమైన బెడ్ అవసరం అయితే రూ. 20000, ప్రత్యేకమైన బెడ్ అసవరం లేకపోతే రూ. 15900 చార్జ్ చేస్తారు. రెండేళ్ల నుంచి నాలుగేళ్ల పిల్లలకు ప్రత్యేక బెడ్ అవసరం లేకపోతే రూ. 15150 తీసుకుంటారు.
ప్యాకేజీలో ఇవి కవర్ అవుతాయి..
విమాన టికెట్లు (హైదరాబాద్-షిర్డీ / ఔరంగాబాద్-హైదరాబాద్) అల్పాహారం, రాత్రి భోజనం ప్యాకేజీలో కవర్ అవుతాయి. మధ్యాహ్న భోజనం పర్యాటకులే సమకూర్చుకోవాలి. అక్కడ లోకల్లో ప్రయాణాలకు ఏసీ వాహన సదుపాయం కల్పిస్తారు. ఐఆర్సీటీసీ టూర్ ఎస్కార్ట్ సేవలు అందుతాయి. ట్రావెల్ ఇన్సురెన్స్ సదుపాయం ఉంటుంది. మరిన్ని వివరాలకు ఐఆర్సీటీసీ టూరిజమ్ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి టూర్‌ప్యాకేజీల విభాగంలో తనిఖీ చేయొచ్చు.