చిదంబరం స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ల కారణంగా కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త రికార్డ్ నమోదైంది.
మే 26న చెన్నైలో జరిగిన IPL 2024 ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అద్భుతంగా బౌలింగ్ చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ని కేవలం 113 పరుగులకే పరిమితం చేసింది. తొలుత టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ, వరుసగా వికెట్లు చేజార్చుకోవడంతో కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టు ఐపీఎల్ ఫైనల్స్ చరిత్రలో ఆల్ టైమ్ చెత్త రికార్డును లిఖించింది.
ఐపీఎల్ ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అతి తక్కువ పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ MA చిదంబరం స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో 2024 ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో మూడు 250-ప్లస్ మొత్తాలతో ఆధిపత్యం చెలాయించిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇలాంటి చెత్త రికార్డును నమోదు చేసింది.
ముంబై ఇండియన్స్ గతంలో IPL 2017 ఫైనల్లో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో 129/8కి పరిమితమైంది. దీంతో IPL ఫైనల్లో అత్యల్ప స్కోరు చేసిన రికార్డును కలిగి ఉంది. అయితే, ఐదుసార్లు ఛాంపియన్ తమ ప్రత్యర్థులను కేవలం 125 పరుగులకే పరిమితం చేశారు.
కెప్టెన్ పాట్ కమిన్స్ 19 బంతుల్లో 24 పరుగులు చేసి తన జట్టు స్కోరును 100 దాటించాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ సింగిల్ ఫిగర్ స్కోర్లతో పెవిలియన్ చేరారు. కానీ, స్టార్ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ 17 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేశాడు.
తొలి ఓవర్లోనే అభిషేక్‌ను మిచెల్ స్టార్క్ అవుట్ చేశాడు. అనంతరం రాహుల్ త్రిపాఠి వికెట్ తీసి సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆండ్రీ రస్సెల్ 19 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా, హర్షిత్ రాణా రెండు వికెట్లు తీశాడు.
ఐపీఎల్ ఫైనల్స్‌లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్లు ఇవే..
113 – IPL 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్
129 – IPL 2017లో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్ vs ముంబై ఇండియన్స్
130 – IPL 2022లో రాజస్థాన్ రాయల్స్ vs గుజరాత్ టైటాన్స్
143 – 2009లో డెక్కన్ ఛార్జర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
148 – IPL 2013లో చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్.