నాకౌట్ స్టేజికి చేరాలంటే తప్పకుండా నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీని నట్టేట ముంచాడు గిల్. విరాట్ కోహ్లీ సెంచరీని వృధాగా మారుస్తూ.. సెంచరీతో చెలరేగిపోయి..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ ఆశలకు గండికొట్టి.. వారి సొంత మైదానంలోనే ఆ జట్టుకు ఘోర ఓటమిని చవి చూపించాడు గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్. నాకౌట్ స్టేజికి చేరాలంటే తప్పకుండా నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీని నట్టేట ముంచాడు గిల్. విరాట్ కోహ్లీ సెంచరీని వృధాగా మారుస్తూ.. సెంచరీతో చెలరేగిపోయి.. తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు శుభ్‌మన్ గిల్. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 2 అదిరిపోయే శతకాలతో ప్రత్యర్ధులను బెంబేలెత్తించిన అతడు.. క్వాలిఫైయర్ 1లో తలబడనున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు స్పష్టమైన సిగ్నల్స్ ఇచ్చాడు. ‘దమ్ముంటే.! ఆపండి’ అంటూ సవాల్ విసిరాడు.
ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 198 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అదిరిపోయే సెంచరీ సాధించాడు. 52 బంతుల్లో 104 పరుగులు చేశాడు. 200 స్ట్రైక్‌రేట్‌తో ఆడిన గిల్.. అతడి ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 5 ఫోర్లు కొట్టాడు. ఇది మాత్రమే కాదు, ఈ సీజన్లో అతడికిది రెండో సెంచరీ. అంతకుముందు మ్యాచ్‌లో కూడా గిల్(101).. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అదే ఫీట్ సాధించాడు.
విరాట్‌ను ఓడించి.. ధోనికి స్వీట్ వార్నింగ్..!
ఐపీఎల్ 2023 రెండో భాగంలో శుభ్‌మన్ గిల్ ఫామ్.. గుజరాత్ టైటాన్స్‌కు మంచి శుభపరిణామం. వరుస సెంచరీలు గిల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు.. క్వాలిఫయర్‌లో చెన్నైపై విజయానికి కూడా దోహదపడే ఛాన్స్ ఉంది. సీఎస్కేతో తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌కు సంబంధించి శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ‘అందులో గెలిచి ఫైనల్‌కు కచ్చితంగా వెళ్తామని ధీమా వ్యక్తం చేశాడు. చెన్నై వేదికగా సీఎస్కేతో తలబడటం ఆసక్తికరంగా ఉంటుంది. అందులో విజయం సాధించి రెండోసారి ఫైనల్‌కు చేరుకునేందుకు ప్రయత్నిస్తాం‘ అని అన్నాడు. కాగా, ప్రస్తుతం గిల్ ఫామ్ చూస్తుంటే.. చెన్నైకి అతడు అడ్డుగోడలా మారనున్నాడని చెప్పవచ్చు. గుజరాత్‌ను ఓడించాలంటే.. గిల్, మిల్లర్, విజయ్ శంకర్లను సీఎస్కే త్వరగా పెవిలియన్ చేర్చాలి.