నితీశ్ రాణా ఔట్
భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన నితీశ్ రాణా (5) హృతిక్ షోకీన్ బౌలింగ్‌లో రమన్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అనంతరం స్పీడ్ పెంచిన అయ్యర్.. ఇంకా ధాటిగా ఆడుతున్నాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 76 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నాడు. 11 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 104/3. అయ్యర్, శార్దూల్ (4) క్రీజ్‌లో ఉన్నారు.
నితీశ్ రాణా ఔట్
భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన నితీశ్ రాణా (5) హృతిక్ షోకీన్ బౌలింగ్‌లో రమన్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 8.1 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 73/3. వెంకటేశ్ అయ్యర్ (49) క్రీజ్‌లో ఉన్నాడు.
రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్
57 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. పియూష్ చావ్లా బౌలింగ్‌లో జన్సెన్‌కు క్యాచ్ ఇచ్చి గుర్భాజ్ (8) ఔటయ్యాడు. క్రీజ్‌లో ఉన్న వెంకటేశ్ అయ్యర్ (39) ధాటిగా ఆడుతున్నాడు. నితీశ్ రాణా క్రీజ్‌లోకి వచ్చాడు. 6 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 57/2.
తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్.. జగదీశన్ ఔట్
రెండో ఓవర్‌లోనే కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. గ్రీన్ బౌలింగ్‌లో హృతిక్ షోకీన్ క్యాచ్ పట్టడంతో ఎన్ జగదీశన్ (0) ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 12/1. రహ్మానుల్లా గుర్బాజ్ (5), వెంకటేశ్ అయ్యర్ క్రీజ్‌లో ఉన్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. రోహిత్ ఔట్, అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం
ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 16) జరుగనున్న డబుల్ హెడర్ మ్యాచ్‌ల్లో తొలుత (మధ్యాహ్నం 3:30 గంటలకు) ముంబై ఇండియన్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కడుపు నొప్పి కారణంగా ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం కాగా, అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ముంబై కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే ఈ మ్యాచ్ ద్వారా సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జన్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నాడు.
తుది జట్లు..
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్, కెమారూన్ గ్రీన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, నేహల్ వధేరా, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, పియుశ్ చావ్లా, డ్యుయాన్ జన్సెన్, రిలే మెరిడిత్
కేకేఆర్: రహ్మానుల్లా గుర్భాజ్, వెంకటేశ్ అయ్యర్, ఎన్ జగదీశన్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, లోకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి