ఐపీఎల్(IPL 2023)లో మరికాసేపట్లో ఏడో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)
ఢిల్లీ: ఐపీఎల్(IPL 2023)లో మరికాసేపట్లో ఏడో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై(CSK)తో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ల ఖాతా తెరించింది. లక్నో(LSG)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి పాలైంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఖాతా తెరవాలని పట్టుదలగా ఉండగా, వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని పాండ్యా(Hardik Pandya) జట్టు తీర్మానించుకుంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ రసవత్తరంగా జరిగే వీలుంది.
గత మ్యాచ్‌లో గాయపడిన కేన్ విలియమ్సన్ స్థానంలో గుజరాత్ డేవిడ్ మిల్లర్‌ను దించుతోంది. అలాగే, విజయ్ స్థానంలో సాయి సుదర్శన్ జట్టులోకి వచ్చాడు. ఢిల్లీ జట్టులోకి అన్రిక్ నోకియా, పోరెల్ రాగా రోవ్‌మన్ పావెల్ బెంచ్‌కు పరిమితమయ్యాడు.
ఢిల్లీ జట్టు: పృథ్వీషా, డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, సర్ఫరాజ్ ఖాన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అమన్ హకీమ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, అన్రిక్ నోకియా
గుజరాత్ జట్టు: వృద్ధిమాన్ సహా (వికెట్ కీపర్), శుభమన్ గిల్, సాయి సుదర్శన్, హర్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, జోషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్