హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సంగుపేట(సంగారెడ్డి), మద్దూరు(నారాయణ పేట), అడవి శ్రీరాంపూర్(పెద్దపల్లి) గ్రామాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నట్లు మీడియాతో చెప్పారు.
ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ సేవలు, 20 MBPS అపరిమిత డేటా ఆప్టికల్ ఫైబర్ ద్వారా అందిస్తామన్నారు. ఇప్పటి వరకు 8వేల గ్రామాలకు ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.