అక్టోబర్ 18 (ఆంధ్రపత్రిక): పెనమలూరు జిల్లా పరిషత్ పాఠశాల చిత్రకళా ఉపాధ్యాయులు, 20 ప్రపంచ రికార్డుల గ్రహీత, ప్రముఖ చిత్రకారులు డాక్టర్. నడిపల్లి రవికుమార్ కు యూ కె దేశానికి చెందిన బ్రేవో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ను కృష్ణాజిల్లా కలెక్టర్ శ్రీ రంజిత్ బాషా గారి చేతుల మీదుగా అందుకున్నారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని మహాత్మా గాంధీ నిలువెత్తు విగ్రహాన్ని పెన్సిల్ మొన పై 2.5 సెంటీమీటర్లు ఎత్తు 5 మిల్లీమీటర్లు వెడల్పు కొలతలతో అత్యద్భుతంగా చెక్కి యూకే దేశానికి చెందిన బ్రేవో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కు పంపగా, వారి రికార్డుల ఘనతల నమోదు పుస్తకములో ప్రచురించి ఈ రికార్డును కొరియర్ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, రవికుమార్ సాధించిన ఘనతను అభినందించారు. ఇలాంటి రికార్డులు మరిన్ని అందుకోవాలని అభిలాషించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి. యలమంచిలి దుర్గా భవాని, పాఠశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు రవికుమార్ కు అభినందనలు తెలియజేశారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!