కోట్లాది మంది అభిమానుల ఆశలను మోస్తూ.. ముచ్చటగా మూడోసారి విశ్వ సంగ్రామంలో ఛాంపియన్‌గా నిలవాలన్న లక్ష్యంతో.. టీమిండియా బరిలోకి దిగుతోంది. ఆదివారం ( అక్టోబర్ 8) మధ్యాహ్నం ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీతో టోర్నీని ప్రారంభించాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది.
కోట్లాది మంది అభిమానుల ఆశలను మోస్తూ.. ముచ్చటగా మూడోసారి విశ్వ సంగ్రామంలో ఛాంపియన్‌గా నిలవాలన్న లక్ష్యంతో.. టీమిండియా బరిలోకి దిగుతోంది. ఆదివారం ( అక్టోబర్ 8) మధ్యాహ్నం ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీతో టోర్నీని ప్రారంభించాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. భారత్ ఆస్ట్రేలియాతో తలపడే మ్యాచ్ అంటే మాములుగా ఉండదు. రెండు బలమైన జట్ల మధ్య జరిగే ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మ్యాచ్‌కి ముందు గాయాల బెడద టీమిండియాను టెన్షన్ పెడుతోంది. ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు గాయాలపాలవుతున్నారు. సూపర్‌ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్.. జ్వరంతో బాధపడుతున్నారు. అతనికి డెంగ్యూ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతంవైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. మ్యాచ్ సమయానికి గిల్ కోలుకునేది డౌటే. అదే జరిగితే అది టీమిండియాకు అతిపెద్ద ప్రతికూలతనే చెప్పాలి. గిల్ ఉంటే అద్భుతమైన శుభారంభాన్ని ఇస్తాడని అభిమానుల నమ్మకం. ఇప్పుడు గిల్ అందుబాటులోకి రాకపోతే ఇషాన్‌కిషన్‌ని ఓపెనింగ్ దింపే ఆలోచనలో ఉంది బీసీసీఐ. ఇక మరో కీలక ప్లేయర్ హార్దిక్ పాండ్యా కూడా గాయపడినట్టు తెలుస్తోంది. ప్రాక్టీస్ సెషన్లో సిరాజ్ వేసిన ఓ బంతిని ఎదుర్కొనే క్రమంలో వైస్ కెప్టెన్ పాండ్యా వేలికి గాయమైనట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. గాయం అంత పెద్దది కాదని తెలుస్తోంది. అయితే ఈ ఆల్‌రౌండర్ మ్యాచ్ ఆడగలుగుతారా.. లేదా అనేది క్లారిటీ లేదు. పాండ్యా గనుక మ్యాచ్ ఆడే పరిస్థితి లేకపోతే.. ఈ స్ట్రాంగ్ ఆల్‌రౌండర్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో అర్ధం కాని పరిస్థితి.
మరోవైపు ప్రపంచకప్‌లో భాగంగా భారత్ ఆడాల్సిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో ఒక్క వామప్ మ్యాచ్ కూడా ఆడకుండానే రోహిత్ సేన బరిలోకి దిగుతోంది. ఇది కూడా అభిమానులను టెన్షన్ పెడుతోంది. మ్యాచ్ సజావుగా సాగేందుకు చెన్నైలోని చెపాక్ క్రికెట్ మైదానంలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. కాగా ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడొచ్చు. అలాగే డిస్నీప్లస్‌హాట్ స్టార్‌లోనూ ఉచితంగా వీక్షించవచ్చు.
టీమ్ ఇండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ మరియు మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా జట్టు:
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, షాన్ అబాట్, మార్నస్ లాబుషాగ్నే, కెమెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ .