హైదరాబాద్: భద్రతామండలి(UNSC)లో భారత్‌ను చేర్చాలని ఫ్రాన్స్ అభిప్రాయపడింది. మారుతున్న ప్రపంచ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మండలిని విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
‘భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ దేశాలకు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందే. అదే విధంగా ఆఫ్రికా ఖండం నుంచి రెండు దేశాలకు సభ్యత్వం ఇవ్వాలి. పలు నిబంధనల్నీ మార్చాల్సిన అవసరం ఉంది’ అని ఆ దేశాధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రోన్ స్పష్టం చేశారు.