IND vs BAN 1st Test : బంగ్లాదేశ్ (Bangladesh)తో రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు చెపాక్ వేదికగా తెర లేచింది. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ 2023-2025 (WTC 2023-2025)లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ భారత్ కు అత్యంత కీలకంగా మారింది.
ఈ సిరీస్ నెగ్గితే భారత్ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో టాప్ ప్లేస్ ను నిలబెట్టుకుంటుంది. పాకిస్తాన్ పై టెస్టు సిరీస్ నెగ్గిన బంగ్లాదేశ్ భారత్ పై కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలనే ఉద్దేశంలో ఉంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి సెషన్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉన్నట్లు బంగ్లాదేశ్ కెప్టెన్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ ఏకంగా ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగనుంది. ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు.
ఈ మ్యాచ్ కోసం టీమిండియా అనూహ్య నిర్ణయం తీసుకుంది. చెపాక్ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం అని అందరికీ తెలుసు. అయినప్పటికీ భారత్ ఏకంగా ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగనుంది. చూస్తుంటే భారత్ ఆస్ట్రేలియా పర్యటన కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టినట్లు అనిపిస్తోంది.
కుల్దీప్ కు నో ఛాన్స్
టీమిండియా ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను పక్కన పెట్టడం విశేషం. స్పిన్నర్లుగా అశ్విన్, జడేజాలను తుది జట్టులోకి తీసుకుంది. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత అశ్విన్ ఆడుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఇక రవీంద్ర జడేజా పెద్దగా ఫామ్ లో లేడు. అయినప్పటికీ అనుభవానికి పెద్ద పీఠ వేసిన భారత మేనేజ్ మెంట్ వీరినే కొనసాగించింది. ఇక దులీప్ ట్రోఫీలో రాణించిన ఆకాశ్ దీప్ కు మరో ఛాన్స్ ఇచ్చింది.
తుది జట్లు
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, జడేజా, అశ్విన్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్
బంగ్లాదేశ్
నజ్ముల్ హుస్సేన్ షాంటో (కెప్టెన్), షాద్మన్ ఇస్లామ్, జకీర్ హసన్, మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబుల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్, హసన్ మహ్ముద్, నహీద్ రాణా, టస్కన్ అహ్మద్