సుమారు రెండేళ్ల తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. మూడు విభిన్న ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేసింది. మరి భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ ఎప్పుడు మొదలవుతుంది? మ్యాచ్ టైమింగ్స్ ఏంటి? తదితర వివరాలను తెలుసుకుందాం రండి.
వన్డే ప్రపంచకప్ తర్వాత మొదటిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లనుంది భారత క్రికెట్ జట్టు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆడేందుకు టీమిండియా ఈ డిసెంబర్లోనే దక్షిణాఫ్రికాకు వెళ్లనుంది. డర్బన్ వేదికగా డిసెంబర్ 10న జరిగే టీ 20 మ్యాచ్‌తో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా సిరీస్ ప్రారంభం కానుంది. జనవరి 7 వరకు అంటే సుమారు నెల రోజులకు పైగా దక్షిణాఫ్రికాలోనే ఉండనుంది భారత జట్టు. సుమారు రెండేళ్ల తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. మూడు విభిన్న ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేసింది. మరి భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ ఎప్పుడు మొదలవుతుంది? మ్యాచ్ టైమింగ్స్ ఏంటి? తదితర వివరాలను తెలుసుకుందాం రండి.
భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ షెడ్యూల్
టీ20 సిరీస్
డిసెంబర్ 10: 1వ T20I- కింగ్స్‌మీడ్, డర్బన్
డిసెంబర్ 12: 2వ T20I- సెయింట్ జార్జ్ పార్క్, గ్కెబెర్హా
డిసెంబర్ 14: 3వ T20I – న్యూ వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్‌బర్గ్
వన్డే సిరీస్
డిసెంబర్ 17: 1వ ODI – న్యూ వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్‌బర్గ్
డిసెంబర్ 19: 2వ ODI – సెయింట్ జార్జ్ పార్క్, గ్కెబెర్హా
డిసెంబర్ 21: 3వ ODI- బోలాండ్ పార్క్, పార్ల్
టెస్ట్ సిరీస్
డిసెంబర్ 26-30: 1వ టెస్ట్- సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్
జనవరి 3-7: 2వ టెస్ట్- న్యూలాండ్స్, కేప్ టౌన్
దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు:
భారత టీ20 జట్టు:
యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్, వైస్ కెప్టెన్). సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.
భారత వన్డే జట్టు:
రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్-వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్.
భారత టెస్టు జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ , ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ (ఫిట్నెస్ ఆధారంగా), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ