మునుపటి షెడ్యూల్ ప్రకారం, T20 సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే బీసీసీఐ తాజా సమాచారం ప్రకారం ఈ మ్యాచ్‌ల సమయాన్ని మార్చారు. దీని ప్రకారం ఇప్పుడు ఈ మూడు టీ20 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి..
భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) మధ్య డిసెంబర్ 10 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (T20I Series) జరగనుంది. వీటితోపాటు కరేబీయన్ గడ్డపై భారత్ 3 వన్డేలు, 2 టెస్టుల సిరీస్ కూడా ఆడనుంది. టీ20 సిరీస్ విషయానికి వస్తే… వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ (ICC) టీ20 ప్రపంచకప్ కంటే ముందు భారత జట్టుకు ఈ సిరీస్ చాలా కీలకం. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ కింగ్స్‌మీడ్‌లోని డర్బన్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇప్పుడు సిరీస్ ప్రారంభానికి మరో రోజు మాత్రమే మిగిలి ఉండటంతో మ్యాచ్‌ల టైమింగ్‌లో భారీ మార్పు చోటు చేసుకుంది.
సమయంలో మార్పు..
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు సంబంధించి అభిమానుల్లో గందరగోళం నెలకొంది. అందుకు కారణం టీ20 మ్యాచ్‌ల ప్రారంభ సమయం మారడమే. వాస్తవానికి ఈ మునుపటి షెడ్యూల్ ప్రకారం T20 సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు 9.30 PM ISTకి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే బీసీసీఐ తాజా సమాచారం ప్రకారం ఈ మ్యాచ్‌ల సమయాన్ని మార్చారు. దీని ప్రకారం ఇప్పుడు ఈ మూడు టీ20 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
వన్డే-టెస్టు మ్యాచ్‌ల సమయాలు..
భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ తర్వాత మూడు వన్డేల సిరీస్ జరగనుంది. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ IST మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే, మిగతా రెండు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇరు జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు IST మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి.
దక్షిణాఫ్రికా టీ20 జట్టు..
ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), ఒట్నియల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రెయిట్జ్‌కే, నాండ్రే బెర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహరాజ్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, ట్రిస్టాంజ్ విల్బ్సి, ట్రిస్టాంజ్ విల్బ్సీ.
టీ20 సిరీస్ కోసం భారత జట్టు..
యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిదీప్ యఫ్ బిష్ణోవ్, కె ఉల్‌దీప్ బిష్ణోవ్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.