India vs Bangladesh, Asia Cup 2023: భారత జట్టు ఇప్పటికే ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా తన బెంచ్ బలాన్ని పరీక్షించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే, టీమ్ ఇండియా ఫైనల్‌కు ముందు తన జోరును కొనసాగించాలని కోరుకుంటుంది. అందువల్ల ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని కోరుకుంటోంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. రోహిత్ శర్మ జట్టులో ఐదు మార్పులు చేశాడు.
ఆసియా కప్-2023లో సూపర్-4 దశ చివరి మ్యాచ్ ఈరోజు భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో మొదలైంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. రోహిత్ శర్మ జట్టులో ఐదు మార్పులు చేశాడు. తిలక్ వర్మ, శార్దుల్ ఠాకూర్, ప్రసీద్ధ్ కృష్ణ, సూర్య కుమార్, మహ్మద్ షమీ టీంలోకి రాగా.. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సిరాజ్, బుమ్రా, కుల్దీప్ విశ్రాంతినిచ్చారు.
ఫైనల్‌కు చేరిన టీమ్ ఇండియా ఆసియా కప్ 2023 టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆ జట్టు ఒక్క ఓటమి కూడా చవిచూడలేదు. టోర్నీలో భారత్‌కి ఇది 5వ మ్యాచ్. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్ రద్దు అయింది. ఆ తర్వాత ఆ జట్టు నేపాల్, పాకిస్థాన్, శ్రీలంకలను ఓడించింది.
ఆసియా కప్ 2023 నుంచి బంగ్లాదేశ్ జట్టు నిష్క్రమించింది. భారత్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిచినా, ఆ జట్టు వద్ద కేవలం 2 పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఇది ఫైనల్‌కు చేరుకున్న శ్రీలంక, భారత్ రెండు జట్ల కంటే తక్కువ పాయింట్లు ఉంటాయి.
భారత్, బంగ్లాదేశ్ గణాంకాలు..
ఇప్పటి వరకు ఇరుజట్ల మధ్య 39 వన్డే మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగాయి. భారత్ 31 మ్యాచ్‌లు, బంగ్లాదేశ్ 7 మ్యాచ్‌లు గెలిచాయి. 1 మ్యాచ్‌లో ఫలితం రాలేదు. వన్డే ఫార్మాట్లో రెండు జట్లు చివరిగా డిసెంబర్ 2022లో తలపడగా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఓడిపోయింది.
ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్(w), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ.
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిటన్ దాస్ (వికెట్ కీపర్), తంజీద్ హసన్ తమీమ్, అన్ముల్ హక్, తౌహీద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, మెహిదీ హసన్ షేక్, నసుమ్ అహ్మద్, తంజీద్ హసన్ షకీబ్, ముష్తాఫిజుర్.