న్యూఢల్లీి,డిసెంబర్ 19 (ఆంధ్రపత్రిక): ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నట్టుగా పార్లమెంటు సాక్షిగా కేంద్రం వెల్లడిరచింది. ఏటేటా విపరీతంగా ఏపీ అప్పుల భారం పెరుగుతోందని స్పష్టం చేసింది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఆంధప్రదేశ్ అప్పు 2,29,333.8 కోట్లు ఉండగా.. ప్రస్తుతం 3,98,903.6 కోట్లకు చేరినట్లుగా లిఖితపూర్వకంగా కేంద్రం తెలిపింది. కేవలం అప్పుల భారం మాత్రమే కాకుండా ఏటా అప్పుల శాతం గణనీయంగా పెరిగిపోతోంది. 2017`18లో 9.8 శాతం అప్పులు తగ్గితే 2020`21 నాటికి 17.1 శాతం పెరుగుదల నమోదయింది. ఏపీ స్థూల జాతీయోత్పత్తిలోనూ గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూనే ఉంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చే నాటికి 2014లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 42.3 శాతం ఉండగా ఆ తరువాత భారీగా తగ్గింది. 2015లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో ఉన్న అప్పులు 23.3 శాతం ఉండగా.. 2021 నాటికి ఏపీ స్థూల జాతీయోత్పత్తిలో 36.5 శాతంగా అప్పులు ఉన్నాయి. సోమవారం లోక్ సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు వివరాలు వెల్లడిరచారు. బ్జడెట్లో చూపించిన అప్పులు కంటే.. ఏపీ ప్రభుత్వం బడ్జెటేతర అప్పులను భారీగా చేస్తోందని ఆయన అన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!