ది.20.08.2022 తేదిన సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సివిల్ కోర్టు ప్రాంగణం లో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయస్థాన భవన సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గౌరవ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు ఇతర వి.వి.ఐ.పి.లు/ వి.ఐ.పి.లు హాజరవుతారు కావున న్యాయస్థాన భవన సముదాయం వద్ద కట్టు దిట్టమైన భద్రత, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, భద్రతా పరంగా ఎటువంటి చిన్న లోపాలు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని తగిన భద్రత చర్యలు చేపట్టాలని నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్., గారు అన్ని శాఖల అధికారులతో ఈ రోజు ది.18.08.2022 తేదిన న్యాయస్థాన భవన సముదాయం నందు భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించడం జరిగింది.
ఈ సమీక్షలో నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్., గారు గౌరవ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గార్ల పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై సంబధిత శాఖల అధికారులకు తగు సూచనలు మరియు సలహాలు ఇవ్వడంతోపాటు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, న్యాయస్థాన భవన సముదాయం వద్ద ఎటువంటి చిన్న లోపాలు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని కట్టు దిట్టమైన పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోర్ట్ న్యాయమూర్తి శ్రీమతి అరుణ సారిక గారు, ఇన్ ఛార్జ్ అఫ్ ఎం.ఎస్.జె. కోర్ట్ న్యాయమూర్తి శ్రీ శ్రీనివాస ఆంజనేయ మూర్తి గారు, డిప్యుటీ పోలీస్ కమీషనర్ శ్రీ విశాల్ గున్ని ఐ.పి.ఎస్.,గారు, సి.ఎస్.డబ్ల్యు.డి.సి.పి. శ్రీ ఏ.బి.టి.ఎస్.ఉదయ రాణి గారు, ఇన్ ఛార్జ్ సబ్ కలెక్టర్ శ్రీ మోహన్ కుమార్ గారు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ విష్ణువర్ధన్ గారు, సి.ఎస్.బి. ఏ.డి.సి.పి. శ్రీ సి.హెచ్.లక్ష్మీపతి గారు, ట్రాఫిక్ ఏ.డి.సి.పి. శ్రీ టి.సర్కార్ గారు, ఏ.సి.పి.లు. రెవెన్యూ, మునిసిపల్, ఎలక్ట్రికల్, ఆర్&బి, ఫైర్, డి.ఎఫ్.ఓ., ఫుడ్ సేఫ్టీ, డి.ఎం.ఓ., కమ్యూనికేషన్, ఐ&పి.ఆర్. అధికారులు మరియు ఇతర అధికారులు పాల్గున్నారు.