తీవ్ర దుమారంతో దిగి వచ్చిన బాబా
మహిళలకు క్షమాపణలు చెబుతూ ప్రకటన
న్యూఢల్లీి,నవంబర్28 (ఆంధ్రపత్రిక): మహిళల వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపడంతో బాబా మహిళలకు క్షమాపణలు చెప్పారు. ఈ వ్యాఖ్యలపై బాబా రాందేవ్‌కు మహారాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించిన రాందేవ్ బాబా.. తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు తెలియజేసినట్లు మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైరపర్సన్ రూపాలీ చకాంకర్ ట్విట్టర్‌లో వెల్లడిరచారు. రాందేవ్ క్షమాపణ లేఖను కూడా పోస్ట్ చేశారు. మహి ళలు ఈ సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలనే ఉద్దేశంతో వారి సాధికారత కోసమే నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ’బేటీ బచావో ` బేటీ పడావో’ కార్యక్రమాలను నేను ప్రోత్సహిస్తాను. మహిళలను అగౌరవపర్చాలన్న ఉద్దేశం నాకు లేదు. సోషల్‌విూడియాలో వైరల్ అవుతోన్న వీడియో క్లిప్ పూర్తిగా వాస్తవం కాదు. అయినప్పటికీ.. ఎవరైనా బాధపడినట్లయితే నేను తీవ్రంగా చింతిస్తున్నా. నా వ్యాఖ్యల వల్ల బాధపడిన వారికి బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నా‘ అని రాందేవ్ బాబా ఆ నోటీసులకు సమాధానమిచ్చారు. మహిళలు తనలాగా దుస్తులు వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు అంటూ యోగా గురు రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. రామ్‌దేవ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఢల్లీి మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ సైతం దేశ మహిళలకు క్షమాపణ చెప్పాలని రామ్‌దేవ్‌ని ట్విట్టర్ మాధ్యమంగా అడిగారు. ‘మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవిస్ ఎదుట రామ్‌దేవ్ మహి ళల్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమైనవి, ఖండిరచదగినవి. ఆయన ప్రసంగంతో మహిళల మనోభావాలు దెబ్బ తిన్నాయి. ఈ విషయంపై రామ్‌దేవ్ క్షమాపణలు చెప్పా లని ట్వీట్ చేశారు. తెలంగాణలోనూ రామ్‌దేవ్ వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ నిరసన చేసింది. నిరసనకారులు రామ్‌దేవ్ బాబా దిష్టి బమ్మను దహనం చేశారు. ఈ నిరసనల్లో మాజీ మంత్రి గీతారెడ్డితోపాటు ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గన్నారు. సిపిఐ నారాయణ సైతం రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిరచారు. యోగా పేరుతో కార్పొరేట్ వ్యవస్థను నడుపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో చాలా చోట్ల మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల మహిళా విభాగాలు రామ్‌దేవ్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రద ర్శనలు చేపట్టాయి. ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో థానేలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వందలమంది మహిళలు విచ్చేశారు. అయితే.. వారిలో చాలామందికి చీరలు ధరించే సమయం దొరక్కపోవడంతో, శిబిరానికి సాధారణ దుస్తుల్లోనే వచ్చారు. ఇది గమనించిన రామ్‌దేవ్.. మహిళలు చీరల్లో బాగుంటారని, సల్వార్ సూట్స్‌లో కూడా బాగానే కనిపిస్తారన్నారు. అక్కడితో ఆగకుండా.. తనలాగా దుస్తులు వేసుకోకపోయినా అందంగా కనిపిస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.