Andhra Pradesh: ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయినిగా సేవలందిస్తున్న కింగ్ జార్జి ఆసుపత్రిలో ఇక నుంచి పక్కగా కాగిత రహిత సేవలందనున్నాయి.ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయినిగా సేవలందిస్తున్న కింగ్ జార్జి ఆసుపత్రిలో ఇక నుంచి పక్కగా కాగిత రహిత సేవలందనున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అన్ని బోధనాసుపత్రుల్లో ఈ -హస్పటలైజేషన్ దిశగా చర్యలు చేపడుతున్నారు. దీని ద్వారా రోగులకు కష్టాలు తప్పనున్నాయి. ఓపీ సేవలకు వచ్చే రోగికి వారి ఆధార్ కార్డు నెంబర్ ద్వారా వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేసి ప్రత్యేకంగా ప్రతి రోగికి ఒక యూనిక్ ఐడీని అందుబాటు లోకి తీసుకురానున్నారు. దీని ద్వారా ఆయా రోగి ఏ వార్డులో ఎన్ని రోజులు చికిత్స పొందారు.ఏ ఏ వైద్య పరీక్షలు అవసరమో కూడా వాటిలో వైద్యులు సూచిస్తారు. ఆయా రోగికి అవసరమైన వైద్యపరీక్షలు చేసి ఆయా రిపోర్టులను సైతం ఇదే పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. కేస్ షీటు లేకుండా అంతా ఆన్లైన్లో పూర్తి వివరాలు నమోదు చేస్తారు. రోగుల వివరాలను పూర్తిగా భద్రపరిచే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!