అంజాద్ భాష డిప్యూటీ చైర్మన్
కడప {ఆంధ్ర పత్రిక} మార్చి 27: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైద్య రంగానికి పెద్ద పీట, పేద బడుగు బలహీనవర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. బి. అమ్ జాద్ బాషా అన్నారు. సోమవారం కడప క్యాంపు కార్యాలయం వద్ద 104 వాహనాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి అమ్ జాద్ బాషా చేతులు మీదగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యతిస్తూ జరుగుతోందని గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరుస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు.