పాఠశాలల్లో వసతుల కల్పనకమిషనర్గా కాటంనేని
అమరావతి,ఆగస్ట్13(ఆర్‌ఎన్‌ఎ): రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఉదయం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాంకేతిక విద్యా శాఖ డైరెక్టరుగా నాగరాణి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాంకేతిక విద్యా శాఖ డైరెక్టర్ బాధ్యతల నుంచి పొల భాస్కర్ రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. జౌళి, చేనేత శాఖ కమిషనర్ గా ఎం. ఎం నాయక్ నియమితులయ్యారు. అలాగే ఎం. ఎం నాయక్‌కు ఆప్కో సీఎండీ, ఖాదీ విలేజ్ బోర్డు సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మికి సాంఫీుక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశించారు. పాఠశాల విద్య శాఖలో పాఠశాలల్లో మౌళిక
వసతుల కల్పన కమిషనర్‌గా కాటంనేని భాస్కర్ నియమితులయ్యారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేకాధికారిని నియమించాలని సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం కొత్త పోస్టు ఏర్పాటు చేసింది. ఆ మేరకు కాటంనేని భాస్కర్‌కు బాధ్యతలు అప్పగించారు. అలాగే మిషన్ క్లీన్ కృష్ణా`గోదావరి కెనాల్స్ కమిషనర్‌గా అదనపు బాధ్యతల్లో కాటంనేని కొనసాగనున్నారు. సర్వ శిక్షాభియాన్ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టరుగా బి. శ్రీనివాస రావు నియమితులయ్యారు. దీంతో పాటు రైతు బజార్ల సీఈఓగా శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతల అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!