నవంబర్ 25 (ఆంధ్రపత్రిక): సాధారణంగా యువ హీరోలు రొటీన్ ఫార్ములాతో కెరీర్‌ను మొదలుపెడుతుంటారు. ఇలా కెరీర్ షురూ చేసిన వారిలో సక్సెస్ అయిన వాళ్లు కొందరు, సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నవారు మరికొందరు. కానీ కొందరు యాక్టర్లు మాత్రం కెరీర్‌ను డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకుని..ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారి జాబితాలో ముందువరుసలో ఉంటాడు యువ నటుడు తేజ సజ్జ తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి.. ప్రస్తుతం హీరోగా తనను తాను నిరూపించుకునే పనిలో ఉన్నాడు. తేజ సజ్జ చేస్తున్న సినిమాలు గమనిస్తే.. ఇతడు కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకున్నట్టు అర్థమవుతుంది. మొదట సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబి చిత్రం లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు తేజ సజ్జ. ఈ సిని మాలో తేజ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత హీరోగా తొలిసారే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ప్రయోగాత్మక సినిమా జాంబిరెడ్డిలో నటించాడు. ఈ మూవీ కూడా డిఫరెంట్ కథాంశం కావడంతో చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.సోలో హీరోగా తేజ సజ్జకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇపుడు రెండోసారి ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో హనుమాన్ సినిమాతో వస్తున్నాడు. ఇప్పటికే విడుద లైన టీజర్ పాన్ ఇండియా ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విజువల్స్‌తో సాగుతుంది. తేజ సజ్జ కెరీర్ ప్లాన్ కోసం పక్కా రూట్ మ్యాప్ ఎలా క్రియేట్ చేసుకున్నాడో చెప్పేందుకు ఈ ఒక్క టీజర్‌తో క్లారిటీ వచ్చేస్తుందంటున్నారు సినీ జనాలు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!