న్యాయస్థానాలు ఉండబట్టే తానింకా బతికున్నానని, న్యాయ వ్యవస్థే లేకపోతే ఈ మూడేళ్లలో తనలాంటి వాళ్లెందరినో వైకాపా వాళ్లు చంపేసి ఉండేవారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇప్పటికే చాలా మందిని చంపేశారని, కొందరి ఇళ్లు తగలబెట్టి, మరి కొందరివి పడగొట్టారని ఆరోపించారు. తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైకాపా నాయకుల కంటే అసభ్యంగా నేనేమీ మాట్లాడలేదు. ఆంధ్రా విశ్వవిద్యాలయం గురించి అయ్యన్నపాత్రుడు మాట్లాడింది తప్పు అని విశాఖ పోలీస్ స్టేషన్లో నాపై కేసు పెట్టారు. నేను ఆంధ్ర యూనివర్సిటీ పరువు తీశానంటున్నారు. విశ్వవిద్యాలయం గ్రౌండ్లో కట్టలుగా నిరోధ్లు దొరికాయి. దాన్ని నేను ప్రస్తావిస్తే సీఎం, విజయసాయిరెడ్డి లాంటివాళ్లు దానిపై విచారణ చేసి వాస్తవాలు బయటపెట్టాలి. అలా చేయకుండా నాపై కేసులు పెట్టడం మూర్ఖత్వం’ అని అయ్యన్నపాత్రుడు అన్నారు. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజులా తననూ కొట్టించాలన్నది వైకాపా నాయకుల ఆలోచన అని ఆయన ఆరోపించారు. ‘నా మీద వైకాపా ప్రభుత్వం 12 కేసులు పెట్టింది. అన్ని కేసుల్లోనూ హైకోర్టు ద్వారా నాకు ఊరట లభించింది. ఇప్పుడు వారి ఆలోచన ఎఫ్ఐఆర్ లేకుండా నా మీద కేసు పెట్టడం.. ఎఫ్ఐఆర్ లేకుండా నన్నెలా అరెస్టు చేస్తారు. 26 జిల్లాల్లో ఎక్కడో ఒక దగ్గర నా మీద కేసు నమోదు చేసి అర్ధరాత్రి ఇంటికి వచ్చి అరెస్టు చేస్తామంటే కుదరదు’ అని చెప్పారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!