నక్కపల్లి,నవంబర్ 17, (ఆంధ్రపత్రిక) : మండలంలోని చినతీనార్ల గ్రామంలో నూకతాత గంగాదేవి వనసరంక్షణ సమితి పరిధిలో గల అటవీ భూముల్లో కొందరు గుట్టుచప్పుడు గాకుండా అక్రమంగా చెట్లను నరికివేస్తు న్నట్టు అటవీశాఖ సిబ్బంది, వీఎస్ఎస్ ప్రతినిధులు గుర్తించారు.ఈ మేరకు అటవీశాఖ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కృష్ణ, వీఎస్ఎస్ అధ్యక్షుడు కంబాల కొర్ల య్య ఈ విషయం తెలిసి వీఎస్ఎస్ భూముల్లో నరికివేతకు గురైన చెట్లను పరిశీలించారు. ఎటువంటి అనుమతులు లేకుండా అటవీ భూముల్లో ఇష్టానుసారం చెట్లు నరికివేస్తున్నారని దీనిపై డీఎఫ్ ఓ స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని కొరయ్య కోరారు.ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని సెక్షన్ ఆఫీసర్ కృష్ణ చెప్పారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!