– ప్రభుత్వ పోరంభోకు భూమి,గెడ్డలను ఆక్రమించిన వైనం
– పట్టించుకోని రెవిన్యూ అదికారులు
– ఆందోళనలో రైతులు,గ్రామస్తులు
– నిర్మాణం ఆపకుంటే కలెక్టర్కు పిర్యాదు
వేపాడ, నవంబర్ 17 (ఆంధ్రపత్రిక) : మండలంలోని వావిలపాడు రెవిన్యూలో సర్వే నెటంబర్ 93/1,94,95 లలో ప్రభుత్వ,పోరంభోకు భూమిని అక్రమించి,గెడ్డవాగులను కలిపి సర్వే నెంబర్ 93/2,3 లలో ఎటువంటి అనుమతులు లేకుండా ఎన్.కే.సి ప్రోజెక్టు ప్రవేట్ (లి) కంపెని అక్రమంగా రాతి క్రసర్ నిర్మాణం చేపడుతున్నారు. ఇక్కడ రాతి క్రసర్ నిర్మాణం చెపడితే అదే భూమికి అనుకొనిఉన్న కూరెడి బంద,బందక్రింద వున్న పంటపోలాలు సర్వనాశనమైపోతాయని రైతులు అందోళన చేందుతున్నారు.ఇప్పటీకే రాతి క్రసర్లు నిర్మాణం చేపట్టడం వలన గ్రామానికి చెందిన పంట పోలాలు బీడు భూములుగా మారి వ్యవసాయం పండక రైతులు బతుకులు అతలాకుతలం అవుతున్నాయని ఇవి చాలక ఇంకా రాతి క్రసరు నిర్మాణం చేపట్టడం ఏమిటని అసలు పంటపోలాలకు అనుకుని క్రసరుకు అనుమతులు ఇస్తే ఏలా ఇస్తారని రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇదే భూమికి అనుకుని వున్న ప్రభుత్వ బందకూడా వుంది.ఇది వరకే బంద కూడా అక్రమణకు గురైనట్లు పిర్యాదు చేసినట్లు తేలుస్తుంది.ఇప్పటికైనా రెవిన్యూ అదికారులు స్పందించి అక్రమ రాతి క్రసరుపై దృష్టి సారించి నిర్మాణం అపాలని ల్ఱెకుంటే కలెక్టర్ కు పిర్యాధు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయమై వావిలాపాడు గ్రామ పంచాయితీ కార్యదర్శి డి.అప్పలనాయుడుని వివరణ కోరగా రాతి క్రసరు నిర్మాణానికి ఎవ్వరికీ ఏటువంటి అనుమతులు ఇవ్వలేదని అనుమతులు లేకుండా క్రసరు నిర్మిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై గ్రామ రెవిన్యూ అదికారి రామానుజంను వివరణ కోరగా ప్రభుత్వ భూమిలో ఏటువంటి నిర్మాణాలు చేపట్టినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గతంలో సర్వే నంబర్ 93/1 ప్రభత్వ భూమిగా గుర్తించి అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టామని వాటిని తోలగిస్తే సహించేది లేదని ఈ విషయం తహశీల్ధారు దృష్టికి తీసుకెళ్ళి చర్యలు తీసుకుంటామన్నారు.