నూజివీడు ; అంగన్వాడి సమస్యల పరిష్కారం కొరకు శాంతియుతంగా పోరాడుతున్న అంగన్వాడి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించడం దుర్మార్గమని ఏలూరు పార్లమెంట్ అంగన్వాడి డ్వాక్రా సాధికార కమిటీ అధ్యక్షురాలు కొమ్మని విజయ అన్నారు. నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం వారు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చే బహుమతి ఇదేనా వేట్టి చాకిరి చేయించుకొని సమస్యలను పరిష్కరించమంటే వేధింపులకు గురిచేస్తారా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 4200 ఉన్న అంగన్వాడి జీతాలను టిడిపి ప్రభుత్వం 10500 కు పెంచిందని కానీ జగన్ రెడ్డి మాత్రం కేవలం 1000 రూపాయలు పెంచుతూ జీవో ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. దీనికి తోడు ఆదాయ పరిమితి నిబంధనను అంగన్వాడీలకు వర్తింపుచేయడంతో సంక్షేమ పథకాలు వర్తించకుండా పోయాయని అన్నారు. ఆరు నెలలుగా సంపూర్ణ పోషణ పథకం అమలుకు నిధులు విడుదల చేయకుండా చిన్నారులకు నాణ్యమైన భోజనం పెట్టాలని అంగన్వాడీలకు ఒత్తిడి తెస్తున్నారని తనికెల పేరుతో అధికారులు వేధింపులకు గురిచేయడంతో రాజమండ్రిలో అంగన్వాడి కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాధాకరం అన్నారు. అంగన్వాడీలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని సమస్యలపై పోరాటం చేయాలి తప్ప ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకోకూడదు అన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీలకు 26000 కనీస వేతనం ఇవ్వాలని,ఫేస్ యాప్ ను రద్దు చేయాలని, మెను చార్జీలను పెంచడంతోపాటు పెండింగ్ టి ఏ బిల్లులను విడుదల చేయాలని ఐసిడిఎస్ కు బడ్జెట్ లో నిధులు పెంచి అంగన్వాడీలకు ఆరోగ్య భీమా కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లను పేర్కొంటూ నూజివీడు సిడిపిఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ సెక్రటరీ సయ్యద్ నజీమ్ మున్నిసా, ఏలూరు పార్లమెంట్ తెలుగు మహిళ కమిటీ సభ్యులు గోల్లు దుర్గాదేవి ,శీలం పద్మా, జాలాది సుధారాణి,, జొన్నలగడ్డ శివలక్ష్మి, రాధా కుమారి, తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!