నవంబర్ 11 (ఆంధ్రపత్రిక): బికినీ బీచ్ సెలబ్రేషన్స్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు ఇలియానా. ఈ గోవా బ్యూటీ నిరంతరం సముద్ర తీరం బీచ్ సెలబ్రేషన్స్ అంటే పడి చస్తుంది. ఛాన్స్ దొరకాలే కానీ వెంటనే బికినీ బీచ్ లో వాలిపోయి బోలెడంత సందడి చేస్తుంది. ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా కొద్దిరోజులుగా ఇలియానా తన కొత్త స్నేహితులతో కలిసి బీచ్ సెలబ్రేషన్స్ లో మునిగి తేల్తోంది. బికినీ అంటే ఇలియానా ఇలియానా అంటే బికినీ అని అంగీకరించక తప్పదు. తన పుట్టినరోజున శుభాకాంక్షలు తెలియజేసిన తన స్నేహితులు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన ఇల్లీ సన్ కిస్డ్ బికినీ ఫోటోను షేర్ చేసింది. ఇలియానా వైట్ అండ్ వైట్ బికినీలో బీచ్ ఇసుకలో మోకరిల్లి కనిపించింది. దీనికి ఆసక్తికర క్యాప్షన్ రాసింది. నా పుట్టినరోజున నేను చాలా ప్రేమను పొందాను. ఈసారి పుట్టినరోజున నా కుటుంబం.. నేను ఇప్పుడు నా స్నేహితులు అని పిలుస్తున్న కొంతమంది అద్భుతమైన కొత్త వ్యక్తులతో గడిపాను. నేను మరికొన్ని ఫోటోలను షేర్ చేస్తాను కానీ ప్రస్తుతానికి ఈ విధంగా అనుభూతి చెందుతూ దీనిని అదృష్టంగా భావిస్తున్నాను. అంటూ సుదీర్ఘ నోట్‌ని రాసింది. ఇలియానా డి క్రూజ్ రకరకాల బికినీలతో బీచ్ పరిసరాల్లో ప్రత్యక్షమైంది. ఎరుపు`తెలుపు బికినీలతో బీచ్ లో స్నేహితులతో కలిసి సందడి చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇల్లీ ఈ ఫోటోలను షేర్ చేసిన వెంటనే అభిమానుల నుండి లైక్‌లు కామెంట్లు వెల్లువెత్తాయి. స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ ను ఇలియానా పెళ్లి చేసుకోబోతోందంటూ ప్రచారం సాగుతోంది. సెబాస్టియన్‌తో ఇలియానా సాన్నిహిత్యంపై బాలీవుడ్ విూడియాలో వరుస కథనాలొస్తున్నాయి. జూలై 16న జరిగిన కత్రిన పుట్టినరోజు వేడుకలో కత్రినా తన భర్త విక్కీ కౌశల్.. ఇలియానా బృందం మాల్దీవుల్లో సెబాస్టియన్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల్లో సెబాస్టియన్‌తో ఇలియానా సాన్నిహిత్యం చూశాక.. దీనిపై ఆరాలు మొదలయ్యాయి. బీచ్ సెలబ్రేషన్ వైరల్‌గా మారిన వెంటనే ఇలియానాతో కత్రినా అసాధారణ స్నేహం గురించి రకరకాల ఊహాగానాలు కొనసాగాయి. అటుపై కత్రినా సోదరుడు.. మోడల్ సెబాస్టియన్‌తో ఇలియానా సన్నిహితంగా మెలుగుతోందని దీనివల్లనే ఇద్దరు నటీమణులుదగ్గరయ్యారని అది స్నేహానికి దారితీసిందని ముంబై విూడియా కథనాలు రాసింది. ఇటీవల సెబాస్టియన్‌ను ఇలియానా పెళ్లి చేసుకోబోతోందన్న పుకారు వ్యాపించింది.