Hair Fall Tips In telugu : ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలటం ప్రారంభం కాగానే కంగారూ పడవలసిన అవసరం లేదు.
మార్కెట్ లో దొరికే నూనెలను వాడవలసిన అవసరం లేదు. ఇంటిలో తయారుచేసుకున్న నూనెను వాడితే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. జుట్టు ఒత్తుగా,ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఈ చిట్కా కోసం ఉసిరిని ఉపయోగిస్తున్నాం. 4 ఉసిరికాయలను తురమాలి. ఇప్పుడు సీజన్ కాబట్టి ఉసిరికాయలు విరివిగా లభ్యం అవుతున్నాయి. ఒక పాన్ లో 100 ml ఆవనూనె పోసి దానిలో తురిమిన ఉసిరి, 5 కరివేపాకు రెబ్బలను ఆకులుగా విడతీసి వేయాలి. ఈ పాన్ ని పొయ్యి మీద పెట్టి ఉసిరి తురుము,కరివేపాకు వేగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేయాలి.
ఈ నూనెను వడకట్టాలి. ఈ నూనెను దాదాపుగా నెల రోజుల పాటు వాడుకోవచ్చు. రాత్రి సమయంలో ఈ నూనెను తలకు రాసి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి తలకు Cap పెట్టుకొని మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఉదయం సమయంలో తలకు నూనె పట్టిస్తే 2 గంటలు అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ నెల రోజుల పాటు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. ఉసిరి,కరివేపాకు, ఆవనూనెలో ఉండే పోషకాలు జుట్టుకి మంచి పోషణ అందిస్తాయి.